Bank Jobs : మంచి మార్కులుండి, తెలుగులో మాట్లాడితే చాలు.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్

Published : Jan 17, 2026, 01:21 PM IST

Bank Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం. కేవలం డిగ్రీ పూర్తిచేసి తెలుగులో మాట్లాడగలిగితే చాలు... ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగాలను పొందవచ్చు. 

PREV
17
పట్టభద్రులకు శుభవార్త

Bank Jobs : మీరు డిగ్రీ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగాల కోసం సిద్దమవుతున్నారా..? అయితే మీకు గొప్ప అవకాశం. ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏకంగా 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి రాత పరీక్ష లేదు.

27
పరీక్ష లేకుండా జాబ్ పొందే అవకాశం

ఈ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కఠినమైన పరీక్షలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు… డిగ్రీ మార్కుల (మెరిట్) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నా మంచి మార్కులుంటే ఈజీగా జాబ్ పొందవచ్చు.

37
భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం

మొత్తం పోస్టులు : 600 (అప్రెంటిస్)

వయోపరిమితి : 20 నుంచి 28 ఏళ్లు. ఎస్సి, ఎస్టిలకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు, PWBD అభ్యర్థులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఏదైనా డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సాధించడంతో పాటు పని అనుభవం ఉండాలి)

ముఖ్య గమనిక : అభ్యర్థికి స్థానిక భాష (తెలంగాణ, ఏపీలో అయితే తెలుగు భాష) తెలిసి ఉండాలి. (10వ లేదా 12వ తరగతి స్థానిక భాషలో పాసై ఉండాలి).

47
దరఖాస్తు గడువు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 25, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నందున, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

57
ఎలా దరఖాస్తు చేయాలి? (స్టెప్-బై-స్టెప్)

1. అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.inను సందర్శించండి.

2. 'కెరీర్స్' విభాగంలో 'అప్రెంటిస్‌షిప్' లింక్‌పై క్లిక్ చేయండి.

3. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వండి.

4. దరఖాస్తులో వివరాలు సరిగ్గా నింపండి.

5. పత్రాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫారమ్ సమర్పించండి.

6. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

67
అప్రెంటిస్‌షిప్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?

అప్రెంటిస్‌షిప్ కేవలం ఉద్యోగం కాదు, ఇది ఒక శిక్షణ. 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలో మీరు బ్యాంకు పనితీరు నేర్చుకోవచ్చు. ఈ అనుభవం భవిష్యత్తులో ఇతర బ్యాంకుల్లో ఉద్యోగం పొందడానికి ఉపయోగపడుతుంది.

77
శాలరీ

అప్రెంటిస్‌షిప్ అనేది కేవలం ట్రైనింగ్ మాత్రమే… కాబట్టి శాలరీ ఉండదు. నెలనెలా 12,300 రూపాయలు స్టైఫండ్ గా లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories