Bank Jobs : తెలుగు యువతకు ఈ అర్హతలుంటే చాలు... ప్రభుత్వరంగ బ్యాంకులో ఈజీగా ఉద్యోగాలు

Published : Jan 19, 2026, 01:41 PM IST

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) బ్యాంకు ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. డిగ్రీ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్న నిరుద్యోగ యువతకు ఇది అద్భుత అవకాశం... వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

PREV
15
నాబార్డ్ బ్యాంక్ జాబ్స్..

NABARD Jobs : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తుంది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్). వ్యవసాయానికి అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు రుణాలు అందిస్తుంటుంది. ఈ బ్యాంకు తాజాగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

25
ఖాళీల వివరాలు

నాబార్డ్ బ్యాంక్ (NABARD) దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచీలలో ఖాళీగా ఉన్న డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 162 పోస్టులను భర్తీ చేయనున్నారు... ఇందులో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (గ్రూప్ బి) - 159, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) - 03 పోస్టులు ఉన్నాయి.

35
విద్యార్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50% మార్కులు, SC/ST/PWBD, మాజీ సైనికులు పాస్ మార్కులు పొంది ఉండాలి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు, హిందీ/ఇంగ్లీష్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీకి 50% మార్కులు, ఇతరులకు పాస్ మార్కులు అవసరం.

45
వయోపరిమితి, శాలరీ

అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 జీతం ఇస్తారు. దీంతో పాటు ఇతర బ్యాంక్ ఉద్యోగుల మాదిరిగానే అలవెన్సులు, ప్రయోజనాలు కూడా ఉంటాయి.

55
దరఖాస్తు విధానం

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. www.nabard.org వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది... చివరి తేదీ ఫిబ్రవరి 03, 2026. కాబట్టి అన్ని అర్హతలుండి బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

​దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.100. ఇతర కేటగిరీల వారికి రూ.450. ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

Read more Photos on
click me!

Recommended Stories