కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు

Published : Dec 06, 2025, 08:12 PM IST

Central Government Jobs : నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకొండి.  

PREV
15
కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతీయువకులకు గుడ్ న్యూస్. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి. అతి తక్కువ విద్యార్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau)లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi Tasking Staff – MTS) పోస్టులను భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 362 ఖాళీలను భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 

దేశ భద్రతా విభాగంలో కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం చాలా మంది కల. భారతదేశ అంతర్గత భద్రతను మెరుగుపరచడంలో, రహస్య సమాచారాన్ని సేకరించడంలో ఈ విభాగం పాత్ర చాలా పెద్దది. ఈ పోస్టులను ప్రభుత్వం పర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తోంది…కాబట్టి యువతకు ఇది ఒక మంచి అవకాశం.

25
ఐబి ఉద్యోగాలకు విద్యార్హతలు

ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు కనీస విద్యార్హత కేవలం 10వ తరగతి మాత్రమే. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ వంటి ఉన్నత విద్యార్హతలు లేని వాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుత అవకాశమిది. దరఖాస్తు చేయడానికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్ధులు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలవారికి వయసు సడలింపు ఉంటుంది.

35
ఎంపిక ప్రక్రియ

ఎంపిక విధానం రెండు దశల రాత పరీక్షలు (టైర్ 1, టైర్ 2) ద్వారా ఉంటుందని ఐబి ప్రకటించింది. మొదటి దశ పరీక్షలో అర్హత సాధించిన వాళ్లను తర్వాతి దశకు పంపుతారు. పరీక్షలో జనరల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, గణితం, ప్రాథమిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించాక సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది…. తర్వాతే ఫైనల్ ఎంపిక చేపడతారు.

45
దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తు నమోదు, నోటిఫికేషన్ చూడటానికి అధికారిక వెబ్‌సైట్ https://www.mha.gov.in/ ను సందర్శించండి. దరఖాస్తుకు చివరి తేదీ 14 డిసెంబర్ 2025.. కాబట్టి సమయం ఉన్నప్పుడే దరఖాస్తు చేయడం మర్చిపోవద్దు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగంలో సేవ చేయాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

55
శాలరీ

గరిష్ఠంగా నెలకు రూ.56,900 వరకు జీతం ఉంటుంది. హోదాను బట్టి దీనికి అదనంగా అలవెన్సులు కూడా ఇస్తారు. ప్రభుత్వ రంగ ప్రయోజనాలు, ప్రమోషన్ అవకాశాలు, ఉద్యోగ భద్రత లాంటి చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories