ఇంజనీరింగ్ యువతకు సూపర్ ఛాన్స్.. మంత్లీ రూ.50,500 సాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

Published : Oct 29, 2025, 01:53 PM IST

BSNL Jobs : కేంద్ర ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ నుండి ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడింది. అర్హతలు,  సాలరీతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి. 

PREV
16
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు

Government Jobs : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)... పరిచయం అక్కర్లేని కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ. రిలయన్స్, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టిపోటీ ఇస్తూ దశాబ్దాలుగా దేశ ప్రజలకు టెలికాం సేవలు అందిస్తున్న సంస్థ బిఎస్ఎన్ఎల్... ఇలాంటి ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం యువతీయువకులకు వచ్చింది. పలు ఉద్యోగాల భర్తీకి ఇటీవల బిఎస్ఎన్ఎల్ ప్రకటన విడుదలచేసింది.

26
పోస్టుల వివరాలు, ఖాళీలు

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి BSNL సిద్దమయ్యింది. మొత్తం 120 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది... ఇందులో టెలికాం విభాగంలో 95, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాల భర్తీలో ఎస్సి, ఎస్టి, ఓబిసి, పిడబ్ల్యుడి, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఉంటాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

36
విద్యార్హతలు

టెలికాం విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. లేదా అందుకు సమానమైన ఇంజనీరింగ్ డిగ్రీని రెగ్యులర్ గా పూర్తిచేసివుండాలి. ఇందులో కనీసం 60 శాతం మార్కులు సాధించివుండాలి.

ఎలక్ట్రానిక్స్ ఆండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇంన్స్ట్రుమెంటల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసివుండాలి. ఈ విద్యార్హతలు కలిగినవారే బిఎస్ఎన్ఎల్ టెలికాం విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులు.

ఇక బిఎస్ఎన్ఎల్ ఫైనాన్స్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు ఛార్టెడ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ ఆండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (CMA) పూర్తిచేసినవారు అర్హులు.

46
వయో పరిమితి

కనీసం 21 ఏళ్లు నిండివుండాలి. గరిష్టంగా 30 ఏళ్ళు మించరాదు. మొత్తంగా 21 నుండి 30 ఏళ్లలోపు వయసుగల యువతీయువకులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి వయోపరిమితి సడలింపు ఉంటుంది.

56
ఎంపిక ప్రక్రియ

 రాత పరీక్ష (కంప్యూటర్ బెస్డ్ ఎగ్జామ్) ద్వారా ఎంపిక చేస్తారు. మల్టిపుల్ ఛాయిస్ అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేపట్టి తుది ఎంపిక చేపడతారు.

66
సాలరీ

నెలనెలా రూ.24900 నుండి రూ.50500 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

దరఖాస్తు, పరీక్ష తేదీలతో ఇతర వివరాలను త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. తాజా సమాచారం కోసం BSNL అధికారిక వెబ్ సైట్స్ www.bsnl.co.in లేదా www.externalexam.bsnl.co.in ను పరిశీలించండి.

Read more Photos on
click me!

Recommended Stories