Central Government Jobs 2025 : మంచి సాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… అదీ సొంతరాష్ట్రంలోనే పోస్టింగ్.. ఇంకేం కావాలి. అర్హత గల తెలుగు యువతీయువకులు వెంటనే అప్లై చేసుకొండి.
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకొండి
BEL Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నవరత్న కంపెనీ 340 ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది గొప్ప అవకాశం. మంచి సాలరీతో రక్షణశాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగావకాశాన్ని మిస్ చేసుకోవద్దు... జాబ్ వచ్చిందా లైఫ్ సెట్ అయినట్లే.
ప్రొబెషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) ఈ-2 గ్రేడ్ : బిఈ/ బిటెక్/బిఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్
ప్రొబెషనరీ ఇంజనీర్ (మెకానికల్) ఈ-2 గ్రేడ్ : బిఈ/ బిటెక్/బిఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్
ప్రొబెషనరీ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) ఈ-2 గ్రేడ్ : బిఈ/ బిటెక్/బిఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్ ఆండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ప్రొబెషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఈ-2 గ్రేడ్ : బిఈ/ బిటెక్/బిఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబిసి కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ రూ.1180 (రూ.1000 ఫీజు, 180 జిఎస్టి) చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు భారత్ ఎలక్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in/ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం ముఖ్యం.
69
వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి, ఎస్టి, ఓబిసి, పిడబ్ల్యుడి వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు సడలింపు ఉంటుంది.
79
ఎంపిక ప్రక్రియ
బిఈఎల్ ప్రొబేషనరీ ఇంజనీర్ ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ రెండింటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. భారత రక్షణ రంగంలో పనిచేయాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక అద్భుత అవకాశం.
89
పోస్టింగ్ ఎక్కడ?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (ఇబ్రహీంపట్నం) తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం బిఈఎల్ కంపెనీల్లో పోస్టింగ్ ఉంటుంది. అలాగే బెంగళూరు, గజియాబాద్, పూణె, చెన్నై, పంచకుల, కొట్ద్వారా, నవీ ముంబై బిఈఎల్ కంపెనీల్లో పోస్టింగ్ ఉంటుంది.
99
సాలరీ
బిఈఎల్ లో ప్రొబేషనరీ ఇంజనీర్లకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 ప్రాథమిక జీతం ఉంటుంది. అనుభవం, ప్రమోషన్లతో జీతం గరిష్టంగా రూ.1,40,000 వరకు పెరగొచ్చు. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఇది మంచి భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.