ఎన్‌ఎస్‌జీ 'బ్లాక్ క్యాట్' కమాండోలను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?

Published : Aug 23, 2025, 02:48 PM IST

NSG Commando: 'బ్లాక్ క్యాట్స్'గా పేరుగాంచిన ఎన్ఎస్జీ కమాండోలుగా మారడం ఎందరో యువతకు ఒక కల. అయితే, ఈ దళంలో చేరాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు, కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.    

PREV
15
ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోల ఎంపిక

దేశ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషించేది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG). వీరినే "బ్లాక్ క్యాట్స్" కమాండోలుగా పిలుస్తారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ దళం దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక భద్రతా దళాల్లో ఒకటిగా పని చేస్తాయి. 

అత్యంత కీలకమైన భద్రతా విభాగాల్లో ఒకటైన ఎన్‌ఎస్‌జీ (NSG)లో కమాండోగా చేరాలనేది చాలా మంది యువత కోరిక. అయితే, ఈ దళంలో చేరాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు, కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. అవేంటో ఓ లూక్కేయండి.

25
NSG ఎలా ఏర్పడింది?

భారత రక్షణ దళాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఒక ప్రత్యేక స్పెషల్ ఫోర్స్. బ్రిటిష్ ఆర్మీ (Special Air Service), జర్మనీలోని బోర్డర్ గార్డ్ గ్రూప్ 9, ఇజ్రాయెల్‌లోని సయెరెట్ మత్కల్, యునైటెడ్ స్టేట్స్‌లోని డెల్టా ఫోర్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రత్యేక దళాలను అధ్యయనం చేసిన తర్వాత, భారత్‌లో NSGని రూపొందించారు. 

ఈ కమాండోలు ఎవరినైనా బంధించడం, ఉగ్రవాది దాడులను ఎదుర్కోవడం వంటి ప్రత్యేక మిషన్‌లకు శిక్షణ పొందుతారు. “జీరో ఎర్రర్” అనే లక్ష్యంతో సుమారు 7,000 మంది NSG కమాండోలు, అధికారులు దేశ భద్రత కోసం పని చేస్తున్నారు.

35
అర్హతలు ఎవరు?

NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక, కీలక భద్రతా దళాల్లో ఒకటి. ఈ దళం అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందుతుంది. 

NSGలో చేరాలంటే.. అభ్యర్థులు ముందుగా భారత సైన్యంలోని దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లేదా కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF),బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ITBP - ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, CISF- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి ఏదైనా సెంట్రల్ సాయుధ పోలీసు దళంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు NSG కమాండో కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

వారి వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, అలాగే శారీరక, మానసికంగా దృఢత్వం ఉండడం తప్పనిసరి.

45
ఎలా సెలక్ట్ చేస్తారు?

ఎన్‌ఎస్‌జీలో నేరుగా నియామకాలు ఉండవు. కమాండోలను ప్రధానంగా సైన్యం లేదా CAPF దళాల నుండి డిప్యూటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి, కఠినమైన ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

మొదటదశ- ప్రాథమిక శిక్షణలో ఆయుధ వినియోగం, పోరాట పటిమ, మానసిక స్థైర్యం, శారీరక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

రెండో దశ- ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, హోస్టేజ్ రిస్క్యూ, బాంబ్ డిస్పోజల్, స్నైపర్ షూటింగ్ వంటి ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తారు. అలాగే అభ్యర్థులను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆపరేషన్లకు సిద్ధం చేస్తారు.

మూడవ దశ- రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మాక్ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసినవారే "బ్లాక్ క్యాట్" కమాండోగా దేశ సేవలో అడుగుపెడతారు.

55
బ్లాక్ క్యాట్ కమాండో జీతం ఎంత?

సాధారణంగా NSG కమాండోలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) లేదా భారత సైన్య నుండి డిప్యూటేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు. మొదటి దశలో వారి బేసిక్ పే + డ్యూటీ అలవెన్స్ సుమారు ₹70,000 – ₹90,000 మధ్య ఉంటుంది. హై-రిస్క్ ఆపరేషన్లలో పనిచేస్తే అదనంగా ₹20,000 – ₹30,000 మిషన్ అలవెన్స్ కూడా అందుతుంది. 

ఇంకా NSG కమాండోలకు హౌసింగ్, వైద్య సౌకర్యాలు, వాహన అలవెన్స్, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సీనియర్, అనుభవజ్ఞులు, ప్రత్యేక మిషన్లలో పనిచేసే కమాండోలు నెలకు సుమారు ₹1,00,000 వరకు జీతం పొందగలరు. 

ఈ విధంగా NSG బ్లాక్ క్యాట్ కమాండోగా చేరడం సాహసోపేతమైన విధానమే కాక, ఎన్నో ఆర్థిక లాభాలు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories