జాబ్ లో చేరగానే రూ.56,100 సాలరీ... ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

Published : Jul 10, 2025, 09:36 PM IST

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 170 అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్, టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, సాలరీతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకొండి. 

PREV
15
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీ...

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 170 ఖాళీలు ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.56,100 జీతంతో పాటు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

 దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 8, 2025 నుంచి జూలై 23, 2025 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

25
1. అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ):

ఖాళీలు: 140

విద్యార్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ (10+2+3 విద్యా విధానంలో). ఇంటర్  లేదా తత్సమాన కోర్సులో ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసినవారు కూడా అర్హులే. అయితే వారి డిప్లొమాలో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి.

35
2. అసిస్టెంట్ కమాండెంట్ (టెక్నికల్):

ఖాళీలు: 30

విద్యార్హత:

మెకానికల్ / ఏరోనాటికల్: నేవల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, మెరైన్, ఆటోమోటివ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ & ప్రొడక్షన్, మెటలర్జీ, డిజైన్, ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) గుర్తింపు పొందిన 'A', 'B' సెక్షన్లతో AMIE అర్హత.

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) గుర్తింపు పొందిన 'A', 'B' సెక్షన్లతో AMIE అర్హత.

రెండు విభాగాలకు: 12వ తరగతిలో ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసినవారు కూడా అర్హులే. అయితే, వారి డిప్లొమాలో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి.

45
వయస్సు, ఫీజు, ఎంపిక విధానం

వయస్సు: 21-25 సంవత్సరాలు. SC/STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు.

దరఖాస్తు ఫీజు: SC/ST/Ex-s అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అందరూ రూ.300 చెల్లించాలి.

ఎంపిక విధానం: ఐదు దశల్లో ఎంపిక జరుగుతుంది.

దశ 1: కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మిషన్ టెస్ట్ (CGCAT)

దశ 2: ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్ (PSB)

దశ 3: ఫైనల్ సెలెక్షన్ బోర్డ్ (FSB)

దశ 4: వైద్య పరీక్షలు

దశ 5: నియామకం

55
దరఖాస్తు విధానం: ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 8, 2025. 

చివరి తేదీ: జూలై 23, 2025. 

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలను పూర్తిగా చదివి తెలుసుకోండి. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో గౌరవప్రదమైన ఉద్యోగాన్ని పొందండి!

Read more Photos on
click me!

Recommended Stories