Published : Aug 06, 2025, 08:33 PM ISTUpdated : Aug 06, 2025, 08:42 PM IST
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,130 పోస్టులను 'లేటరల్ ఎంట్రీ' పద్ధతిలో నిపుణులతో భర్తీ చేయాలని UPSC భావిస్తోంది. ఈ పద్ధతి ద్వారా ప్రైవేట్, ఇతర రంగాల్లో అనుభవం ఉన్న నిపుణులను నేరుగా నియమిస్తారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,130 పోస్టులకు 'లేటరల్ ఎంట్రీ' ద్వారా నిపుణులతో భర్తీ చేయాలని UPSC (Union Public Service Commission) యోచిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పోస్టులు భర్తీ అవుతాయని అంచనా.
DID YOU KNOW ?
యూపిఎస్సి ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC)ఛైర్మన్, సభ్యులను నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. దేశంలోనే అత్యున్నతమైన నియామక సంస్థ ఈ యూపిఎస్సి.
25
'లేటరల్ ఎంట్రీ' అంటే ఏమిటి?
'లేటరల్ ఎంట్రీ' అంటే అనుభవం ఆధారంగా ఉద్యోగం ఇచ్చే పద్ధతి. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ప్రైవేట్ లేదా ఇతర రంగాల్లో పనిచేసిన నిపుణులను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పోస్టులకు నేరుగా నియమించడం. ఇది సాధారణ UPSC సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా కాకుండా ప్రత్యేక రంగాల్లో నైపుణ్యం, అనుభవం ఉన్నవారిని ఎంపిక చేసే ప్రక్రియ.
35
1130 ఉద్యోగాల భర్తీ
1 నుంచి 13 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులను వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 1,130 పోస్టులకు నియమించాలని UPSC యోచిస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో కొత్త నైపుణ్యాలు, వివిధ ప్రభుత్వ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ నియామకాల ముఖ్య ఉద్దేశ్యం. ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ వంటి రంగాల నుండి నిపుణులను నియమించడం ద్వారా విధాన రూపకల్పన, కార్యక్రమాల అమలును మెరుగుపరచవచ్చని కేంద్రం భావిస్తోంది.
గత కొన్నేళ్లుగా కేంద్రం వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను నేరుగా నియమిస్తోంది. 2024లో 45 పోస్టులకు 'లేటరల్ ఎంట్రీ' నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది. కానీ రిజర్వేషన్ వివాదం కారణంగా ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈసారి ఆ సమస్యలను పరిష్కరించి కొత్త పద్ధతిలో నియామకాలు చేపడుతోంది.
“ఈ ఉద్యోగాలు లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే ప్రారంభ స్థాయి ఉద్యోగాలు కావు. ఈ అవకాశం గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది” అని UPSC ఛైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. “ఈ నియామక ప్రక్రియ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు నియామకాలు జరుగుతాయి" అని ఆయన చెప్పారు.
55
నిపుణుల నియామకం
ఈ 'లేటరల్ ఎంట్రీ' పద్ధతి పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఒక వారధిని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు. ఇది సాంప్రదాయ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పోటీతత్వాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.