Railway Jobs : తెలుగు యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ రైల్వేలో ఏకంగా రూ.3,56,819 సాలరీ, ఇతర అలవెన్సులతో కూడిన ఉద్యోగాన్ని పొందవచ్చు. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.
Railway Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడింది. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) సంస్థలో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి భారతదేశంలోని అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ప్రయత్నిస్తారు... కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ ఉద్యోగాలను పొందేందుకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
27
మఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 14 అక్టోబర్ 2025
దరఖాస్తుల చివరి తేదీ : 12 అక్టోబర్ 2025
రాత పరీక్ష తేదీ : 23 నవంబర్ 2025 (హైదరాబాద్ లో కూడా పరీక్ష కేంద్రం ఉంది)
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎస్సి, ఎస్టి, ఎక్స్ సర్వీస్ మెన్స్, పిడబ్ల్యుడి అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఓబిసి, జనరల్ వర్గాల అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
37
విద్యా అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బిఎస్సి కెమిస్ట్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్లపాటు ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారులు 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు కూడా ఉన్నాయి.
ఎస్సి, ఎస్టి వర్గాల అభ్యర్థులకు 5 ఏళ్లు
ఓబిసి వర్గాలకు 3 ఏళ్లు
దివ్యాంగులకు (PwBD) గరిష్టంగా 15 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు.
ఈ వయోపరిమితి సడలింపులను ఉపయోగించుకుని అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
57
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు RITES సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.rites.com/ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. నవంబర్ 12, 2025 లోపు దరఖాస్తును సమర్పించండి. ఓ అభ్యర్థి కేవలం ఒకే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి... కాబట్టి మీకు దగ్గర్లోని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి.
67
ఎంపిక విధానం
రైట్స్(RITES) లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష (Written Test), సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Document Scrutiny) ఆధారంగా ఎంపిక చేస్తారు. హైదరాబాద్ తో పాటు డిల్లీ, ముుంబై, బెంగళూరు, కలకత్తా, గౌహతి, భువనేశ్వన్, బిలాయ్, చెన్నై, రాంచీ, అహ్మదాబాద్, పాట్నా, లక్నో నగరాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. అంటే ఈ నగరాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
77
సాలరీ
ఎంపికైన వారికి నెలనెలా రూ.29,735/- జీతం లభిస్తుంది. అంటే ఏడాదికిక రూ.3,56,819 అందుకుంటారు. ఇది కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
గమనిక : RITES కాంట్రాక్ట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కాబట్టి నిర్ణీత కాలం మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగిస్తారు.