Railway Jobs 2025 : తెలుగు యువతకు బంపరాఫర్ .. సికింద్రాబాద్ రైల్వేలో జాబ్ ఛాన్స్, ఫుల్ డిటెయిల్స్

Published : Sep 15, 2025, 11:34 AM IST

Railway Jobs 2025 : ఇండియన్ రైల్వేస్ 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. మీరు డిగ్రీ పూర్తి చేసివుంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ ఇక్కడ చూడండి. 

PREV
16
ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ...

Railway Jobs 2025: ఇండియన్ రైల్వేస్‌లో పనిచేయాలనేది చాలా మంది కల… అలాంటి యువతీయువకుల కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇండియన్ రైల్వేస్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇలా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన తెలుగు యువతకు అద్భుత అవకాశమనే చెప్పాలి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి డిగ్రీలు పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే తెలుగు యువత వెంటనే దరఖాస్తు చేసుకొండి.

26
సికింద్రాబాద్ పరిధిలో భర్తీచేసే జాబ్స్ ఎన్ని?

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్లలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఇలా మొత్తం 368 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా ఇందులో దక్షిణమధ్య రైల్వే (సికింద్రాబాద్) డివిజన్ పరిధిలో 25 పోస్టులు ఉన్నాయి. వీటిని రిజర్వేశన్ల వారిగా పరిశీలిస్తే… జనరల్ 12, ఎస్సి 5, ఎస్టి 3, ఓబిసి 4, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు ఉన్నాయి.

36
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం తేదీ : 15 సెప్టెంబర్, 2025 (ఇవాళ్టి నుండి)

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 14 అక్టోబర్ 2025

దరఖాస్తు ఫీజు అభ్యర్థుల కేటగిరీని బట్టి మారుతుంది. ఎస్సి, ఎస్టి, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఈబిసి అభ్యర్థులకు ₹250 దరఖాస్తు ఫీజు ఉంటుంది... CBT ఎగ్జామ్ తర్వాత వీరికి ఫీజు తిరిగి ఇస్తారు. ఇతరులు అంటే జనరల్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ₹500 దరఖాస్తు ఫీజు ఉంటుంది.... వీరికి CBT తర్వాత ₹400 తిరిగి ఇస్తారు.

సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. అభ్యర్థులు రైల్వే నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు, అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అర్హతలు మీకు ఉన్నాయని నిర్ధారించుకోండి. దరఖాస్తుకు చివరి తేదీ 14.10.2025 కాబట్టి, త్వరగా దరఖాస్తు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ కలను సాకారం చేసుకోండి.

46
రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు విద్యార్హతలు

ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీలోపు అంటే అక్టోబర్ 14, 2025 లోపు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి… ప్రస్తుతం డిగ్రీ చదివేవారికి ఈ ఉద్యోగాలకు అవకాశం ఉండదు. 

వయో పరిమితి :

1 జనవరి 2026 నాటికి 20 నుండి 33 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు అర్హులు. అయితే రిజర్వేషన్లు కలిగిన అభ్యర్ధులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

56
రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

1. CBT (కంప్యూటర్ బెస్డ్ టెస్ట్) : ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

2. CBAT (కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) : తప్పకుండా క్వాలిఫై కావాలి. (70% CBT + 30% CBAT)

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ : విద్యా, వయోపరిమితి, కులంతో పాటు ఇతర సర్టిఫికెట్స్ పరిశీలన

4. మెడికల్ ఎగ్జామినేషన్ : ఇందులో శారీరక పరీక్షలు నిర్వహిస్తారు.

66
రైల్వే సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగులకు సాలరీ

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుండి రూ.44,900 వరకు సాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సులు కలుపుకుని మొత్తం రూ.60,000 వరకు సాలరీ లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories