
Jobs in Income Tax Deparment : ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం కోసం కల కంటున్నారా? ఇలాంటివారికి అద్భుత అవకాశం వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో లేదా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరింత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం పొందవచ్చు. కేంద్ర ప్రత్యక్ష పన్నల బోర్డు (CBDT) డిప్యుటేషన్ పై డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.
ఈ నియామకం సాధారణ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ 'B' గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ కేడర్ కింద జరుగుతుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టుల భర్తీ ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, కాన్పూర్, చండీగఢ్, కోల్‌కతా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాల్లో జరుగుతుంది.
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయడమే కాదు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియను క్రింద చదవండి.
భర్తీ చేయనున్న ఉద్యోగాలు : 8
పోస్టు పేరు: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్
అర్హతలు :
నియామక ప్రక్రియ: డిప్యుటేషన్ ప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులు అర్హులు.
విద్యార్హతలు :
మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్స్)
కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech) (కంప్యూటర్ అప్లికేషన్స్)
గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ చేసినవారు కూడా అర్హులు. ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులే.
అవసరమైన పత్రాలు
గత 5 సంవత్సరాల వార్షిక పనితీరు అంచనా నివేదిక (APAR)
కేడర్ క్లియరెన్స్
ఇంటిగ్రిటీ సర్టిఫికెట్
విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్
గత 10 సంవత్సరాలలో ప్రధాన శిక్షలు/పెనాల్టీల వివరాలు
అభ్యర్థులు ఈ అన్ని పత్రాలను సంబంధిత అధికారుల ద్వారా సంతకం చేయించి పంపాలి.
వేతనం
ఎంపికైన అభ్యర్థులకు ₹44,900 నుండి ₹1,42,400 వరకు జీతం చెల్లించబడుతుంది.
వయోపరిమితి
దరఖాస్తుదారు గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి.
ఎవరు దరఖాస్తు చేసుకోకూడదు?
శాఖలో ప్రమోషన్‌కు అర్హులైన అభ్యర్థులు డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోకూడదు.
డిప్యుటేషన్‌పై నియమితులైన అభ్యర్థులు ప్రమోషన్‌కు అర్హులు కారు.
పరీక్షా కేంద్రాలు
నియామక ప్రక్రియ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడుతుంది-
ఢిల్లీ
లక్నో
హైదరాబాద్
కాన్పూర్
చండీగఢ్
కోల్‌కతా
చెన్నై
అర్హత కలిగిన అభ్యర్థులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindia.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ incometaxindia.gov.in ను సందర్శించండి.
పేజ్ ఓపెన్ కాగానే కిందకు స్క్రోల్ చేసి "Recruitment Notices" పై క్లిక్ చేయండి.
డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ నియామకానికి చెందిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. వాటిని చదవండి. ఆ తర్వాత దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. అది డౌన్ లోడ్ చేసుకొండి.
దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించి, అన్ని అవసరమైన పత్రాలతో ఈ చిరునామాకు పంపండి: "the Directorate of
Income Tax (Systems), Central Board of Direct Taxes, Ground Floor, E2, ARA Center, Jhandewalan Ext., New Delhi – 110 055"
దరఖాస్తుకు చివరి తేదీ :
నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి 30 రోజుల్లోపు దరఖాస్తు ఆదాయపన్ను కార్యాలయానికి చేరాలి. (డిసెంబర్ 31, 2024లో నోటిఫికేషన్ విడుదలైంది)
ఈ నియామకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం incometaxindia.gov.in ఓపెన్ చేసి అధికారిక నోటిఫికేషన్ చదవండి.