పదో తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. లక్షల జీతంతో తెలంగాణ, ఏపీలో పోస్టింగ్

Published : Nov 17, 2025, 06:15 PM IST

AIIMS Recruitment 2025 : కేవలం పదో తరగతి అర్హతతో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం… అదీ తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఐదంకెల జీతంతో. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకొండి… జాబ్ పొందండి. 

PREV
18
ఎయిమ్స్ లో ఉద్యోగాలు

Central Government Jobs : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక హాస్పిటల్లో పనిచేసే అద్భుత అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న AIIMS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఒకటిరెండు కాదు ఒకేసారి 1,353 ఖాళీలను భర్తీచేయనున్నారు. కాబట్టి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

28
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు

తెలుగు యువతకు కూడా ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ (బిబినగర్), మంగళగిరి ఎయిమ్స్ లలో కూడా ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరగనుంది. కాబట్టి సొంత రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను పొందే అవకాశముంది. అతి తక్కువగా పదో తరగతి నుండి ఉన్నత చదువులు డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ వంటి అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

38
పోస్టుల వారిగా ఖాళీలు

తాజా నోటిఫికేషన్ ద్వారా AIIMS లో 52 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో

  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
  • జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ / క్లర్క్
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్ / ఎలక్ట్రికల్)
  • క్యాషియర్
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
  • ల్యాబ్ అసిస్టెంట్
  • డ్రైవర్
  • రిసెప్షనిస్ట్
  • జూనియర్ వార్డెన్
  • హౌస్ కీపర్
  • యోగ ఇన్స్ట్రక్టర్
  • మెడికల్ ఫోటోగ్రాఫర్
  • అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్
  • సీనియర్ నర్సింగ్ ఆఫీసర్
  • ఓటి, అనస్థీషియా టెక్నిషియన్
  • ఫార్మాసిస్ట్
  • అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
  • ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2
  • ఫైర్ టెక్నిషియన్
  • జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్

ఇంకా అనేక సాంకేతిక, పరిపాలనా విభాగాలలో పోస్టులు ఉన్నాయి.

48
విద్యా అర్హతలు

పోస్టును బట్టి విద్యా అర్హతలను నిర్ణయించారు. 

  • 10వ తరగతి
  • 12వ తరగతి
  • డిప్లొమా
  • డిగ్రీ
  • ఇంజనీరింగ్

ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ తప్పనిసరి.

58
వయోపరిమితి

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 35–40 సంవత్సరాలు (పోస్టును బట్టి మారుతుంది)

వయస్సు సడలింపు

ఎస్సి / ఎస్టీ – 5 సంవత్సరాలు

ఓబిసి – 3 సంవత్సరాలు

68
ఎంపిక విధానం

అభ్యర్థులను కింది పద్ధతిలో ఎంపిక చేస్తారు

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • స్కిల్ టెస్ట్
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్
78
దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ఫీజు

జనరల్ / ఓబిసి – రూ.3,000

ఎస్సి / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ – రూ.2,400

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తును ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 14 నవంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ : 02 డిసెంబర్ 2025

పరీక్ష తేదీ : 22.12.2025 నుంచి 24.12.2025 వరకు

దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో విద్యా అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి అన్ని వివరాలను జాగ్రత్తగా చదివి నిర్ధారించుకోవాలి.

88
సాలరీ

 పోస్టును బట్టి జీతం ఉంటుంది. 

కనీసం : రూ.18,000

గరిష్టం : రూ.1,51,100

Read more Photos on
click me!

Recommended Stories