Jobs : మీరు బీకాం, బిఎస్సి, ఇంజనీరింగ్ చదివుంటే చాలు .. ఏకంగా రూ.160000 సాలరీతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

Published : Nov 17, 2025, 09:52 AM IST

Central Government Jobs : మీరు సాధారణ డిగ్రీ లేదంటే అంతకంటే ఎక్కువ చదువు పూర్తిచేసివుంటే చాలు… కేంద్ర ప్రభుత్వ సంస్థలో లక్షల జీతంలో ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం. 

PREV
18
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ భర్తీ

Government Jobs : నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే MSTC (Metal Scrap Trade Corporation Limited) సంస్థలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ సంస్థలో 37 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీలను ప్రకటించారు. ఇంజనీరింగ్, ఫైనాన్స్, సైన్స్, న్యాయ విభాగాల్లో విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను పొందవచ్చు.

28
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 నవంబర్ 2025

దరఖాస్తు చేసేందుకు చివరితేదీ : 30 నవంబర్ 2025

రాత పరీక్ష : డిసెంబర్ 2025 (త్వరలోనే తేదీని ప్రకటిస్తారు)

38
ఖాళీల వివరాలు

ఎమ్ఎస్టిసి లో మొత్తం 37 ఖాళీలున్నాయి.

  • సిస్టమ్ - 7 ఖాళీలు
  • ఆపరేషన్స్ - 4 ఖాళీలు
  • అడ్మిన్ - 2 ఖాళీలు
  • లా (లీగల్) - 1 ఖాళీ
  • ఫైనాన్స్ - 23 ఖాళీలు

రిజర్వేషన్ వారిగా చూసుకుంటే మొత్తంగా జనరల్ విభాగంలో 14 పోస్టులకు గాను ఎస్సి 1, ఎస్టి 1, ఓబిసి 4, ఈడబ్యుఎస్ 1, అన్ రిజర్వుడ్ 7 పోస్టులు ఉన్నాయి.

ఫైనాన్స్ విభాగంలో 23 పోస్టులకు గాను ఎస్సి 4, ఎస్టి 1, ఓబిసి 7, ఈడబ్ల్యుఎస్ 2, అన్ రిజర్వుడ్ 9 పోస్టులు ఉన్నాయి.

48
విద్యార్హతలు

ప్రతి విభాగానికి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సిస్టమ్ విభాగానికి బీఈ/బిటెక్ (ఎలక్ట్రానిక్స్/సీఎస్/ఐటీ) లేదా ఎంసిఏ ఉండాలి. ఆపరేషన్స్, అడ్మిన్ విభాగాలకు డిగ్రీ/పీజీ ఉండాలి. లా విభాగానికి లా డిగ్రీ/పీజీ, ఫైనాన్స్ & అకౌంట్స్ విభాగానికి సీఏ/సీఎంఏ/ఎంబిఏ అర్హతలుండాలి. లా, ఫైనాన్స్ విభాగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

58
వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ

వయో పరిమితి :

28 ఏళ్ల వయసులోపే వారు అర్హులు. ఎస్సి, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 ఏళ్లు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ :

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అభ్యర్థులు MSTC అధికారిక వెబ్‌సైట్ https://www.mstcindia.co.in/MSTC_Careers/ లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు :

జనరల్, ఓబిసి అభ్యర్థులకు 500 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు... అన్ని అర్హతలుంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

68
ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది

  • CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
  • గ్రూప్ డిస్కషన్
  • ఇంటర్వ్యూ

మొదట CBTలో అర్హత సాధించిన వారిని తర్వాతి దశలకు పిలుస్తారు. తుది ఎంపిక మూడు దశల్లోని మార్కుల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు అంగీకరించాలి.

78
ఎగ్జామినేషన్ సెంటర్స్

తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో పరీక్ష రాయవచ్చు. ఇక బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్-మొహాలి, గౌహతి, జైపూర్, కలకత్తా, లక్నో, ముంబై/థానే/నవీ ముంబై/MMR, నాగపూర్, న్యూడిల్లీ/డిల్లీ NCR, పాట్నా, రాయ్ పూర్, రాంచీ, వడోదరలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.

88
సాలరీ

ఎంపికైన అభ్యర్థులకు నెలనెలా రూ.50,000 నుండి రూ.1,60,000 జీతం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories