
BHEL Jobs : కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నెలకు రూ.65,000 జీతం, ఇతర అలవెన్సులు...వర్క్ ప్లేస్ హైదరాబాద్, విశాఖపట్నం... ఇంతకంటే మంచి అవకాశం తెలుగు యువతకు ఇంకేముంటుంది. డిగ్రీలు చేసినవారికే కాదు కనీస విద్యార్హత పదో తరగతి కలిగివారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు... ఇంకా ఐదురోజులు మాత్రమే దరఖాస్తుకు సమయం ఉంది. ఇంతకూ ఏ సంస్థలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు? దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, సాలరీ తదితర పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)...భారతదేశంలో ఇంజనీరింగ్ ఆండ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన ప్రముఖ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బిహెచ్ఈఎల్ యూనిట్స్ ఉన్నాయి... ఇలా హైదరాబాద్, విశాఖపట్నంలలో కూడా యూనిట్స్ ఉన్నాయి. ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి (థర్మల్, న్యూక్లియర్, హైడ్రో, సోలార్), పవర్ ట్రాన్స్మిషన్ తో పాటు రక్షణ, ఏరోస్పేస్, రైల్వే ట్రాన్స్ పోర్ట్, ఆయిల్ ఆండ్ గ్యాస్, ఇ-మొబిలిటి వంటి విభాగాల్లో 180 కి పైగా ప్రోడక్ట్స్ అందిస్తోంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది... వివిధ ట్రేడ్స్ లో 515 ఆర్టిషన్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
1. బాయిలర్ ఆక్సిలియరీస్ ప్లాంట్ (Boiler Auxiliaries Plant) - రాణిపేట్, తమిళనాడు
2. హెవీ ప్లేట్స్ ఆండ్ వెస్సెల్స్ ప్లాంట్ (HPVP)- విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
3. హెమి ఎక్విప్మెంట్ రిపేర్ ప్లాంట్ (HERP) - వారణాసి, ఉత్తర ప్రదేశ్
4. ఎలక్ట్రానిక్స్ డివిజన్ (EDN) - బెంగళూరు, కర్ణాటక
5. ఫ్యాబ్రికేషన్, స్టాంపింగ్ ఆండ్ ఇన్సులేటర్ ప్లాంట్ (FSIP) - జగదీష్పూర్, ఉత్తర ప్రదేశ్
6. హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్లాంట్ (HEEP) - హరిద్వార్, ఉత్తరాఖండ్
7. సెంట్రల్ ఫౌండ్రి ఆండ్ ఫోర్గ్ ప్లాంట్ (CFFP) - హరిద్వార్, ఉత్తరాఖండ్
8. హెవీ పవర్ ఎక్విప్లెంట్ ప్లాంట్ (HPEP) - హైదరాబాద్, తెలంగాణ
9. హెవీ ఎలక్ట్రికల్ ప్లాంట్ (HPEP) - భోపాల్, మధ్యప్రదేశ్
10. ట్రాన్స్ ఫార్మర్ ప్లాంట్ (TP) - ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్
11. హై ప్రెజర్ బాయిలర్ ప్లాంట్ (HPBP) - తిరుచురాపల్లి
1. ఫిట్టర్ -176
2. వెల్డర్ - 97
3. టర్నర్ - 51
4. మెషినిస్ట్ -104
5. ఎలక్ట్రీషియన్ -65
6. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 18
7. ఫౌండ్రీమన్ - 4
ఫిట్టర్ - 22
వెల్డర్ -10
మెషినిస్ట్ - 6
మొత్తం 38 పోస్టులు
ఫిట్టర్ - 10
టర్నర్ -20
మెషినిస్ట్ -20
మొత్తం 50 పోస్టులు
2. హైదరాబాద్ లో అన్ రిజర్వుడ్ 22, ఈడబ్ల్యూఎస్ 4, ఓబిసి 13, ఎస్సి 8, ఎస్టి 3 పోస్టులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి తెలుగు భాషపై అవగాహన ఉండాలి
జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 27 ఏళ్ళలోోపు వయసు ఉండాలి.
ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 30 ఏళ్లు (3 ఏళ్లు సడలింపు), ఎస్సి, ఎస్టి -32 ఏళ్లు (ఐదేళ్లు సడలింపు) ఉండాలి.
వికలాంగులకు జనరల్ అయితే 10 ఏళ్ళు సడలింపు ఉంటుంది. అదే ఓబిసి అయితే 13, ఎస్సి, ఎస్టి అయితే 15 ఏళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభతేదీ : 16-07-2025 10AM నుండి ప్రారంభమయ్యింది.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : సెప్టెంబర్ 12, 2025, 11:45PM వరకు
దరఖాస్తు ఫీజు ;
జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ రూ.1072 (రూ.600 పరీక్ష ఫీజు, 400 ప్రాసెసింగ్+జిఎస్టి)
ఎస్సి, ఎస్టి, ఓబిసి ఎగ్జామ్ పీజు లేదు… ప్రాసెసింగ్ ఫీజు రూ.400+జిఎస్టి కలిపి మొత్తం రూ.472 చెల్లించాలి.
విద్యార్హతలు :
పదో తరగతి పాసై ఉండాలి. ఆయా ట్రేడ్ లో నేషపల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC/ITI) లేదా నేషనల్ అప్రెంటైస్ షిప్ సర్టిఫికేట్ (NAC)... ఇందులొ 60 శాతం మార్కులతో జనరల్, ఓబిసి అభ్యర్థులు... 55 శాతం మార్కులతో ఎస్సి,ఎస్టి అభ్యర్థులు
ఎంపిక విధానం :
స్టేజ్ 1 : కంప్యూటర్ బెస్డ్ పరీక్ష (CBT)
స్టేజ్ 2 : స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్
నెలకు రూ.29,500 నుండి రూ.65,000 సాలరీ ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. (ఏడాదిపాటు టెంపరరీ ఎంప్లాయ్ గా పనిచేయాలి… తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు)