తెెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు? అర్హతలు, సాలరీ తదితర పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.
శారీరక పరీక్ష లేకుండానే తెలంగాణ హోంశాఖలో ఉద్యోగాలు...
Telangana Police Recruitment Board : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది చాలామంది నిరుద్యోగ యువత కల... ఇందుకోసం రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. డిగ్రీలు పూర్తిచేసి ఏళ్లతరబడి ప్రిపేర్ అయ్యేవాళ్లు చాలామంది ఉంటారు... వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే పోలీస్ శాఖలో ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్దమయ్యేవారికి శారీరక ఫిట్ నెస్ చాలా అవసరం. కానీ ఎలాంటి శారీరక పరీక్ష లేకుండానే తెలంగాణ హోంశాఖ కొన్ని ప్రత్యేక ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. కేవలం రాత పరీక్ష ద్వారానే ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఇది శారీరకంగా శ్రమించలేని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ జారీచేసిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి. మీకు అన్ని అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని మంచి సాలరీతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ ఉద్యోగాలను పొందడం ద్వారా జీవితంలో స్థిరపడటమే కాదు మంచి హోదా, సమాజంలో గౌరవం దక్కుతుంది.
28
తెలంగాణ హోంశాఖ నోటిఫికేషన్ వివరాలు
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఇవి న్యాయశాఖకు సంబంధించిన ఉద్యోగాలు అయినప్పటికి పోలీస్ శాఖ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇలా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రాసిక్యూషన్ సర్వీసెస్ కు సంబంధించిన 118 ఏపిపి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది రాష్ట్ర హోంశాఖ.
38
APP ఉద్యోగాలకు విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగివుండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB, BL) పూర్తిచేసి ఉండాలి... ఇదికూడా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి పూర్తిచేయాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు చేసినవారు కూడా అర్హులే.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు తప్పకుండా లాయర్ గా ప్రాక్టీస్ చేసిన అనుభవం కావాలి. మూడేళ్లపాటు తెలంగాణలో ఏదైనా క్రిమినల్ కోర్టులో లాయర్ గా పనిచేసివుండాలి. అలాగే 15 ఆగస్ట్, 2025 లోపు అడ్వోకేట్ గా పనిచేస్తుండాలి.
58
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు విధానం
TSLPRB అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 12 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది... అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు ఎస్సి, ఎస్టిలకు రూ.1000 గా నిర్ణయించారు. ఇక ఓసి, బిసి, ఇతర అభ్యర్థులకు రూ2000 దరఖాస్తు ఫీజు ఉంది.
తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు - 5 ఏళ్ళు సడలింపు
ఎక్స్ సర్వీస్ మెన్స్ (ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసినవారు) - 3 ఏళ్ళు సడలింపు
ఎన్సిన్సి ఇన్స్ట్రక్టర్స్ (NCC Instructors) కు - 3 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది.
పదో తరగతి (ssc) మెమో లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ లోని డేట్ ఆఫ్ భర్త్ ను పరిగణలోకి తీసుకుంటారు.
78
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. రెండు పేపర్లు ఉంటాయి... కేవలం ఇంగ్లీష్ లోనే పరీక్ష ఉంటుంది.
పేపర్ 1 - 200 మార్కులు, 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు
పేపర్ 2 - 200 మార్కులు - డిస్క్రిప్టివ్ టైప్
ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. రాతపరీక్ష, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను నిర్ణయిస్తారు. సెలక్షన్స్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఉంటుంది.
మెడికల్ టెస్ట్ :
మంచి ఆరోగ్యవంతులై ఉండాలి.
స్పష్టంగా మాట్లాడగలగాలి, వినికిడి లోపం, కంటిచూపు లోపం ఉండకూడదు
88
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సాలరీ
తెలంగాణ హోంశాఖ పరిధిలో పనిచేసే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు అనుభవం ఆధారంగా నెలకు రూ.54,220 నుండి 1,33,630 సాలరీ ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగుల మాదిరిగానే అలవెన్సులు కూడా లభిస్తాయి.