Bank Jobs : ఎలాంటి రాతపరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులో లక్షల జీతంతో మేనేజర్ స్థాయి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఫుల్ డిటెయిల్స్ కోసం ఇక్కడ చూడండి.
ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Bank Jobs : భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 02.10.2025. విద్యార్హతలు, జీతం, ఖాళీలు, దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి.
25
SBI ఉద్యోగాల వివరాలు, విద్యార్హతలు, వయసు, సాలరీ వంటి ఫుల్ డిటెయిల్స్
ఎస్‌బిఐలో మూడు కీలకమైన పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్), మేనేజర్ (ప్రోడక్ట్స్ - డిజిటల్ ప్లాట్ ఫార్మ్), డిప్యూటీ మేనేజర్ (ప్రోడక్ట్స్ - డిజిటల్ ప్లాట్ ఫార్మ్) స్థాయి ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. పోస్టులవారిగా అభ్యర్థులకు కావాల్సిన అర్హతల గురించి తెలుసుకుందాం.
35
SBI పోస్టులవారిగా వివరాలు
• మేనేజర్:
ఈ పోస్టుకు మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు ₹85,920 నుండి ₹1,05,280 వరకు ఉంటుంది. బి.ఇ. / బి.టెక్ (ఐటీ/ కంప్యూటర్ సైన్స్) లేదా ఎం.సి.ఏ. పూర్తి చేసి ఉండాలి. వయస్సు 28 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
• డిప్యూటీ మేనేజర్:
ఈ పోస్టుకు 25 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు ₹64,820 నుండి ₹93,960 వరకు ఉంటుంది. బి.ఇ. / బి.టెక్ లేదా ఎం.సి.ఏ. పూర్తి చేసి ఉండాలి. వయస్సు 25 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
• మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్):
ఈ పోస్టుకు 63 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు ₹85,920 నుండి ₹1,05,280 వరకు ఉంటుంది. ఏదైనా డిగ్రీతో పాటు ఎం.బి.ఏ. (ఫైనాన్స్) లేదా సి.ఏ. పూర్తి చేసి ఉండాలి. వయస్సు 25 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ, విద్యార్హతల, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగాలకు మూడేళ్లు, మేనేజర్ (ప్రోడక్ట్స్ - డిజిటల్ ప్లాట్ ఫార్మ్) కు 5 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ (ప్రోడక్ట్స్ - డిజిటల్ ప్లాట్ ఫార్మ్) కు 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ₹750 దరఖాస్తు ఫీజు ఉంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, ఫీజు చెల్లింపు ఉంటుంది.
55
SBI ఉద్యోగాలకు దరఖాస్తు విధానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ముందు అధికారిక నోటిఫికేషన్‌లో అర్హతలు చూసుకోండి. ఇది మంచి అవకాశం కాబట్టి అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. గత గురువారం (సెప్టెంబర్ 11) నుండే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది… అక్టోబర్ 2, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.