ఏపి పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్ సైట్ http://psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వెబ్ సైట్ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPP)చేసుకున్నవారు దీనిద్వారా లాగిన్ కావచ్చు. లేదంటే ముందుగా రిజిస్టర్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఉపయోగించి ఈ OTPR క్రియేట్ చేయాలి. తర్వాత తానేదార్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.
APPSC ఉద్యోగాల దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సి, ఎస్టి, బిసి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు పరీక్ష ఫీజు రూ.80 మినహాయింపు ఉంటుంది.
వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి చెందిన అభ్యర్ధికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు కేవలం ఆన్లైన్ లోనే చెల్లించాలి. ఇతర మార్గాల్లో స్వీకరించబడవు.
అటవీశాఖక ఉద్యోగాల దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11 సెప్టెంబర్ 2025
దరఖాస్తుకు చివరితేదీ : 01 అక్టోబర్ 2025, రాత్రి 11.00PM వరకు స్వీకరించనున్నారు.