జాబ్ లొకేషన్ హైదరబాదే .. నెలకు రూ.2,38,895 జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ

Published : Jul 03, 2025, 05:39 PM IST

హైదరబాద్ లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెెలుసుకొండి. 

PREV
16
హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం... నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం... వర్క్ ప్లేస్ హైదరాబాద్... ఇంకేం కావాలి.. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొండి. గట్టిగా ప్రయత్నించి ఈ ఉద్యోగాన్ని సాధించారంటే మీ లైఫ్ సెట్ అయిపోతుంది.

కేంద్ర సైన్స్ ఆండ్ టెక్నాలజీ విభాగం పరిధిలోని ఇంటర్నేషన్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పౌడర్ మెటలర్జీ ఆండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్ లోని బాలానగర్ లో ఈ సంస్థ కార్యాలయం ఉంంది… ఇక్కడినుండే ఈ సంస్థ కార్యాకలాపాలను నిర్వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన రీసెర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ సంస్థ. ఇందులో పలు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

26
పోస్టులవారిగా పూర్తి వివరాలివే :

1. Scientist E (సైంటిస్ట్ ఈ)

మొత్తం ఖాళీలు : 3

సాలరీ : నెలకు రూ.2,38,895

వయో పరిమితి : 45 ఏళ్లు మించరాదు.

సెలక్షన్ విధానం : ఇప్పటివరకు చేపట్టిన R&B లో సాధించిన అచీవ్ మెంట్స్, ARCI కి చెందిన R&B ప్రాజెక్టులు, ప్రోగ్రాంలపై ప్రెజెంటేషన్... పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా చేపడతారు.

విద్యార్హతలు, అనుభవం :

గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఫిజికల్ సైన్సెస్ లో డాక్టరేట్ డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ చేసివుండాలి. అలాగే ఏదైనా ఇండస్ట్రీ లేదా R&B లేదా అకడమిక్ ఇన్స్టిట్యూషన్ లేదా సైన్స్ ఆండ్ టెక్నాలజీ సంంస్థలో పదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

36
2. Scientist C (సైంటిస్ట్ సి)

ఖాళీలు : 1

సాలరీ : నెలకు రూ.1,36,405

వయోపరిమితి : 35 ఏళ్లలోపు వయసుండాలి.

ఎంపిక విధానం : చేపట్టిన ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ పై ప్రెజెంటేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

విద్యార్హతలు :

గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇజనీరింగ్ పూర్తిచేసి వుండాలి. నాలుగేళ్లు ఏదైనా ఇండస్ట్రీ లేదా R&B లేదా అకడమిక్ ఇన్స్టిట్యూషన్ లేదా సైన్స్ ఆండ్ టెక్నాలజీ సంస్థ లేదా స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ లో పనిచేసిన అనుభవం ఉండాలి.

46
3. Scientist B (సైంటిస్ట్ బి) (సైన్సెస్)

ఖాళీలు : 2

సాలరీ : రూ.1,14,945

వయోపరిమితి : 35 ఏళ్లలోపు ఉండాలి

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ

విద్యార్హతలు : ఫిజికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ లేదా కెమికల్ సెన్సెన్స్ మాస్టర్ డిగ్రీ ఉండాలి.

56
4. Scientist B (సైంటిస్ట్ బి) (ఇంజనీరింగ్)

ఖాళీలు : 5

సాలరీ : రూ.1,14,945

వయోపరిమితి : 35 ఏళ్లలోపు వయసు ఉండాలి

ఎంపిక ప్రక్రయ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

విద్యార్హతలు : ఇంజనీరింగ్ ఆండ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ

66
దరఖాస్తు ప్రక్రియ

అర్హతలు గల అభ్యర్థులు ARCI అధికారిక వెబ్ సైట్ https://www.arci.res.in/careers/ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

సైంటిస్ట్ E పోస్టులకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.1000 ఫీజు ఆన్ లైన్ చెల్లించాలి.

మిగతా పోస్టులకు జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూబిడి, మహిళా అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుకు చివరితేదీ : జులై 28, 2025

Read more Photos on
click me!

Recommended Stories