Tech Lay Offs: 6 నెలల్లో లక్ష మందిని ఇంటికి పంపేసిన సంస్థలు...ఆగని ఉద్యోగ కోతలు!

Published : Jul 03, 2025, 02:26 PM IST

టెక్ కంపెనీలు మళ్లీ ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, ఐబీఎం తదితర సంస్థలు ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగులను తొలగించాయి.

PREV
17
ఉద్యోగుల కోత

2025లో టెక్నాలజీ రంగం మళ్లీ ఉద్యోగుల కోతల దశలోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ టెక్ కంపెనీలు మానవ వనరులను తగ్గిస్తూ, కృత్రిమ మేధస్సు ఆధారిత పనితీరుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఏడాది తొలి ఆరు నెలల్లోనే లక్షకు పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.

27
మైక్రోసాఫ్ట్ – 9,100 ఉద్యోగాల కోత

 మైక్రోసాఫ్ట్ సంస్థ 2025లో ఇప్పటివరకు నాలుగు విడతలుగా 9,100 మందిని తొలగించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగులలో సుమారు 4 శాతం. ముఖ్యంగా గేమింగ్, ఎక్స్‌బాక్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో కోతలు నమోదయ్యాయి.

37
ఇంటెల్ – 20 శాతం ఉద్యోగులకు ముప్పు

 అమెరికాకు కేంద్రంగా ఉన్న ఇంటెల్ సంస్థ, జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ తయారీ యూనిట్‌ను మూసివేసి ఉద్యోగులను తొలగించింది. ప్రధాన కార్యాలయంలో 100 మందిని తొలగించిన సంస్థ, మొత్తం సిబ్బందిలో 20% మందిని తొలగించే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్ చిప్ డిజైనర్లు, క్లౌడ్ ఆర్కిటెక్చర్ నిపుణులు, టెక్ మేనేజర్లపై ప్రభావం పడనుంది.

47
అమెజాన్ – నాలుగో సారి కోతలు

 అమెజాన్ సంస్థ కూడా 2025లో నాలుగు విడతలుగా ఉద్యోగుల తొలగింపులు చేసింది. కమ్యూనికేషన్, సర్వీస్ విభాగాలు, వండరీ పాడ్‌కాస్ట్ వంటి యూనిట్లు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న 14,000 మందిని తొలగించే యోచనలో ఉంది.

57
ఐబీఎం – HR విభాగంలో

ఐబీఎం – HR విభాగంలో 8,000 మందికి పైగా తొలగింపు ఐబీఎం సంస్థ, మానవ వనరుల విభాగాన్ని AI టూల్స్‌తో భర్తీ చేస్తూ, ఇప్పటికే 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. కొన్ని విభాగాల్లో మొత్తం టీమ్‌లు పని కోల్పోయాయి.

ఇండియన్ ఐటీ – ఇన్ఫోసిస్ ఉదాహరణ ఇన్ఫోసిస్ సంస్థ కూడా తక్కువ స్థాయి ఉద్యోగులపై కోతలు పెట్టింది. గత నెలలో 240 మందిని, ఫిబ్రవరిలో 300 మంది ప్రెషర్స్‌ను తొలగించింది. కంపెనీ భవిష్యత్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

గూగుల్, మెటా, హెచ్‌పీ, టిక్‌టాక్ – కొనసాగుతున్న లేఆఫ్స్ గూగుల్ – ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, క్లౌడ్, HR విభాగాల్లో కోతలు మెటా – 3,600 మందిని తొలగించింది హెచ్‌పీ – పునర్వ్యవస్థీకరణ కింద 2,000 మందిని తొలగించింది టిక్‌టాక్ – డబ్లిన్ కార్యాలయంలో 300 మందికి ఇంటిముఖం చూపించింది

67
ఓలా ఎలక్ట్రిక్, సేల్స్‌ఫోర్స్, బ్లూ ఆర్జిన్

ఓలా ఎలక్ట్రిక్, సేల్స్‌ఫోర్స్, బ్లూ ఆర్జిన్ – వేల కొద్దీ తొలగింపులు ఓలా ఎలక్ట్రిక్ – ఐదు నెలల్లో 1,000 మందికిపైగా ఉద్యోగ కోత సేల్స్‌ఫోర్స్, బ్లూ ఆర్జిన్ – ఒక్కొక్కటి 1,000 మందిని తొలగించాయి సైమన్స్ గ్రూప్ – ఆటోమేషన్, EV ఛార్జింగ్ విభాగాల్లో 5,600 మందిని తొలగించింది కాన్వా, ఆటోమేటిక్, క్రౌడ్ స్ట్రైక్, మ్యాచ్‌గ్రూప్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ లాంటి సంస్థల్లో కూడా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి

77
ఈ లేఆఫ్స్ వెనుక ఉన్న ప్రధాన కారణాలు

 ఆర్థిక భద్రతపై దృష్టి

ఆపరేషనల్ ఖర్చుల తగ్గింపు

కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ వనరుల వినియోగం

ఇప్పుడు కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయగల అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఆటోమేషన్, డిజిటలైజేషన్ వల్ల ఉద్యోగులను  తగ్గిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories