AI Jobs : ఇక సాప్ట్ వేర్ల స్థానంలో ఈ ఉద్యోగాలు... ఇందుకోసం చేయాల్సిన కోర్సులివే..

Published : Mar 05, 2026, 06:34 PM IST

కేవలం కోడింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్ మాత్రమే చేయగలిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్స్ ఇక ఉండవు … ఇవి యంత్రం మింగిన వెలగపండు. మరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్థానంలో కొత్తగా వచ్చే ఉద్యోగాలేవో తెలుసా..?

PREV
16
మనుషులు గాడిదలు, గుర్రాలు కాదుగా..!

ఎడ్లు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు..

ఒకప్పుడు వ్యవసాయం, వ్యక్తుల- సరకుల రవాణా , యుద్ధాలు... మొదలయిన వాటిలో విరివిగా వినియోగంలో ఉండేవి.

యంత్రమొచ్చింది.

వీటి అవసరం చాలా మటుకు తొలగి పోయింది.

అంటే వాటి ఉద్యోగాలు పోయాయి.

కానీ మనిషి జంతువు కాదు.

నేర్చుకొనే సామర్థ్యముంది.

మారిన పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకొనే శక్తి ఉంది.

ఒకప్పుడు అంటే నలబై- యాభై ఏళ్ళ క్రితం ప్రతి ఆఫీస్ లో టైపిస్ట్ లు.. స్టేనోలు ఉండేవారు.

టకటక అని టైపు మెషిన్ ల శబ్దాలు వినబడేవి.

సందుగొందుకు ఒక టైపు ఇన్స్టిట్యూట్ ఉండేది.

డిగ్రీ చదివిన, చదువుతున్న యువతీయువకులు అక్కడ .. లోయర్ .. హయ్యర్ అని శిక్షణ పొందేవారు.

70 - 80 లలో అనేక ప్రేమాయణాలు టైపు ఇన్స్టిట్యూట్ లలో మొదలయ్యేవి.

అటుపై .. టైపు మెషిన్ స్థానంలో కంప్యూటర్ .

టైపిస్ట్ స్థానంలో డిటిపి ఆపరేటర్ పోస్ట్.

గాడిదకు పనిలేక పోయింది.

మనిషి మాత్రం టైపిస్ట్ నుంచి డిటిపి ఆపరేటర్ అయ్యాడు .

ఇదీ పరిణామం.

26
ఏఐ యుగంలో కొత్త ఉద్యోగాలు రావా..?

మరి ఇప్పుడు..?

ఇప్పుడూ అనుసరణ తప్పనిసరి.

కానీ దానికి అవగాహన ఉండాలి..

అనుసరణ... తగిన రీతిలో సాగాలి.

"1980 కంప్యూటర్ లొచ్చాయి .. ఉద్యోగాలు పోతాయి అని ఆందోళన..

అది నిజం కాకపోవడం"... వద్దే మనం ఆగిపోతే ...బతుకు అధోగతి.

ఇప్పుడొచ్చింది మానవ మేథస్సు కంటే ... అనేక విషయాల్లో... అనేక రెట్లు సమర్థంగా... శక్తియుతంగా ఆలోచించగలిగిన... స్వతహాగా నేర్చుకోగలిగిన తెలివయిన యంత్రం .

ఈ తేడా తెలుసుకోవాలి.

యంత్రాల ఉపయోగం సుమారుగా 250 సంవత్సరాల క్రితం మొదలయ్యింది.

మొదటి పారిశ్రామిక యుగం .

అటుపై విద్యుత్ వాడకంతో రెండవ పారిశ్రామిక యుగం .

కంప్యూటర్ల వాడకంతో మూడవ పారిశ్రామిక యుగం.

మొదటి మూడు వేరు .

ఇప్పుడు కృతిమ మేథతో మొదలయిన నాలుగవ పారిశ్రామిక యుగం వేరు.

ఈ కీలక అంశాన్ని విస్మరించి... గతంలో ప్రతి పారిశ్రామిక యుగంలో యంత్రాల వాడకంతో మనషుల అవసరాలు ఏలా పెరిగాయో ... ఉద్యోగాల సంఖ్య ఎలా పెరిగిందో ... ఇప్పుడు కూడా ఆలా పెరుగుతుంది... అనుకొంటే తప్పులో కాలేసినట్టే .

ఇప్పుడున్నది తెలివయిన యంత్రం .

అది ఉద్యోగాలను తినేస్తుంది.

రొటీన్ పనులను చేసేస్తుంది.

"కొత్త ఉద్యోగాలు రావా?"... అంటే ... వస్తాయి .

యంత్రం నూటికి యాభై ఉద్యోగాలను తినేస్తే ... కొత్తగా ఇరవై ముప్పై ఉద్యోగాలు వస్తాయి .

అంటే గతం కంటే నిరుదోగ్యం పెరుగుతుంది .

భారీగా పెరుగుతుంది .

కొంతమంది జీవిత కాల నిరుద్యోగులుగా ఉండిపోతారు .

వారిని కూర్చో పెట్టి ప్రభుత్వాలు పోషించాలి .

36
అంత వీజీ కాదు..

యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ల సంఖ్య తగ్గించేందుకే గేట్ల తాత బృందం మరో వైపునుంచి నరుక్కొని వస్తున్నారు .

అది వేరే టాపిక్ .

వచ్చే కొత్త ఉద్యోగాలు ఎలా ఉంటాయి..?

చెప్పుకొన్నాం కదా.. ఇప్పుడున్నది గతంలోలా బుర్ర లేని యంత్రాలు కాదు .

సూపర్ ఫాస్ట్ గా నేర్చుకొంటాయ . అవి కూడా ఎవాల్వ్ అవుతున్నాయి.

వాటిని నడిపించే వారికి... అవి చేయలేని పని చేసే వారికి మాత్రమే ఇక జాబ్స్ .

ఈ ఒక్క పాయింట్ ను బాలమిత్ర క్లాసుల్లో మూడు గంటలు వివరిస్తున్నా.

అయినా టైం సరిపోదు .

ఇది అర్తం కావడం అంత వీజీ కాదు .

వీజీ కాదు .......

వీజీ కాదు ..........

వీజీ కాదు...................

గంటల తరబడి నెట్ లో పందిలా దొర్లాడుతూ .. అడ్డమయిన మలం పోస్ట్లు తింటూ .. చదివే ఓపిక .. అర్థం చేసుకొనే శక్తి ... కోల్పోయిన వారికి ఇది అర్ధం అయ్యే ఛాన్స్ లేదు.

అందుకే నా బాలమిత్ర క్లాసులు ఆన్లైన్ లో ఉండవు అని ఖరాఖండీగా చేప్పేసా .

46
ఇక ఈ ఉద్యోగాలకే డిమాండ్..

అడుగుతున్న మిత్రులకు కోసం ఒక చిన్న ఉదాహరణ .

కేవలం కోడింగ్ , బేసిక్ ప్రోగ్రామింగ్ మాత్రం చేయగలిగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్... . ఇక ఉండవు .. రావు .

ఆ ఉద్యోగం... యంత్రం మింగిన వెలగపండు .

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్థానంలో

1. కృతిమమేథ (ఏఐ) ఇంజనీర్

2. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్

3. డేటా సైంటిస్ట్

4. కృతిమ మేథ ప్రోడక్ట్ మేనేజర్

5. కృతిమ మేథ పరిశోధన మేనేజర్

6. కంప్యూటర్ విజన్ ఇంజనీర్

7. రోబోటిక్స్ ఇంజనీర్ ,

8. కృతిమ మేథా విలువల నిపుణుడు

9. జెనరేటివ్ AI స్పెసలిస్ట్..

లాంటి ఉద్యోగాలు వస్తాయి .

"ఇంకేమి పండగే ..

ఒక ఉద్యోగం స్థానంలో 9 ఉద్యోగాలు వస్తాయి!" అనుకొంటున్నారా .

అంత వీజీ కాదు .

వీటి కోసం కొత్త కోర్స్ లు చదవాలి .

లీనియర్ ఆల్జీబ్రా, కాలుకులస్, స్టాటిస్టిక్స్ , డేటా విజువలైజషన్, ఇమేజ్ ప్రాసెసింగ్ , ఆబ్జెక్ట్ డిటెక్షన్ , టెక్స్ట్ ప్రాసెసింగ్ . Q లెర్నింగ్ లాంటి వాటిలో స్పెషలైస్ చెయ్యాలి .

"ఏముంది.. ? అమీర్పేట్ లో ట్రేనింగ్ సెంటర్స్ వస్తాయి . అక్కడ 6 నెలల కోచింగ్ తీసుకొంటే పోలా ?" అనుకుంటున్నారా ?

కోడింగ్ .. సి సి ప్లస్ జావా . లాంటి వాటికైతే అమీర్పేట్ చెల్లింది .

ఇప్పుడు నేర్వాల్సిన కోర్స్ లు .. నేర్వాల్సిన విద్యలు వేరు .

మట్టిగోడపై ప్రాజెక్ట్ కట్టలేము.

పునాదులు మేటర్స్!

వాటిని నేర్వాలి అంటే .. కొన్ని స్కిల్స్ కావాలి .

56
ఏఐ యుగంలో ఉద్యోగం కావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే

1. కొల్లబోరేషన్ స్కిల్స్ కావాలి .

ఇది కావాలి అంటే.. సామజిక తెలివితేటలు భావోద్వేగ తేలితేటలు కావాలి .

ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ ఆరేళ్ళు సమాజానికి దూరంగా బ్రాయిలర్ కోడిలా బతికిన వారికి ఇది ఎలా వస్తుంది ?

2. ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ కావాలి .

ఇది కావాలి అంటే క్రిటికల్ థింకింగ్ .. లాటరల్ థింకింగ్.. .. కావాలి .

" నోరు మూసుకొని .. చెప్పింది విను. క్లాస్ అయ్యాక అయిదారు సార్లు చదివి చూడకుండా పొల్లు పోకుండా రాయి... " టైపు బట్టీ చదువుల్లో బాల్యం గడిపిన వారికి .. క్రిటిల్ థింకింగ్ ఎలా వస్తుంది ?

3. అన్నింటికీ మించి రోబో యుగంలో పని దొరకాలంటే .. సృజనాత్మక శక్తి కావాలి .

మొబైల్ చేతిలో ఉంటే అది చస్తుంది .

హైటెక్కు రీతిలో పిల్లలని పెంచిన వారికి ఈ పాయింట్ అర్థం కావడానికి ఏడు జన్మలు చాలవు.

పైన ఒక ఉదాహరణలో టైపిస్ట్ స్థానంలో డిటిపి ఆపరేటర్ వచ్చింది అనుకొన్నాము .

ఇప్పుడు కృతిమ మేథ యుగంలో AI... టైపు చేస్తుంది . కంటెంట్ జనరేట్ చేస్తుంది.

ఇంకెక్కడ ఉద్యోగం ?

అంత వీజీ కాదు.

చాట్ జిపిటి కి... గ్రోక మామకు మించి రాయాలి.

వాసిరెడ్డి అమర్నాథ్ లా రాయాలి .

రాయాలి అంటే ఏముండాలి ?

సృజన.

కుశాగ్ర బుద్ధి .

అన్నిటికి మించి గుండెతలుపులు తడుతూ రాసే శక్తి ఉండాలి . అంటే సామజిక భావోద్వేగ తెలివితేటలు... భాష పై పట్టు.

AI అంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ .

దీని తలతన్నాలి అనే సంకల్పం తో అమర్నాథ్ ఇంటలిజెన్స్ డెవలప్ చేసుకొన్నా .. నిరంతర అధ్యనం .. ఆత్మ విశ్వాసం తో .

తాను నేర్చింది నలుగురికీ నేర్పితేనే గురువుకు తృప్తి .

బాలమిత్ర కు అదే మూలం .

ఇదో పెద్ద టాపిక్ లెండి మాస్టారు .

తెలుగు జాతి ఈ విషయాల్ని ముప్పై ఏళ్ళ నాడే మరచింది . చదువంటే మార్కులు .. అటు పై సాఫ్ట్ వేర్ జాబ్ .

అని రెండు తరాలు బతికేసింది .

హ్యాపీ గా బతికేసింది .

ఇప్పుడేంటి ఈ గోల ?????

66
ఆ మేథావులకు నా సలహా...

కొడగు పంది కూర గురించి .. ఆ పెళ్ళిలో మిగతా వంటకాలు గురించి హ్యాపీగా చదువుతుంటే .. ఈ వాసిరెడ్డి అమర్నాథ్ ఏంటి ?

"ఉద్యోగాలే ఉండవు . సాఫ్ట్ వేర్ ఆఫీస్ లు ఎత్తి పోతాయి కార్లు అమ్మకాన్ని వస్తాయి" అంటూ ఏదో వెదవ వాగుడు..??

ముందు ఆలా అంటాడు ..

తరువాత" నేను ఆలా అనలేదు అంటాడు ."

ఇంతకీ అన్నట్టా ?

లేనట్లా ?

మూడు ముక్కలో చెప్పడేంది ?

ఎప్పుడూ సోది .. సోది ..

పొద్దునే చేంతాడంత పోస్ట్లు పెడుతాడు .

ఏదో పోనీ అని చదివి పెడుతుంటే ..

ఇంకా రెచ్చి పోయి .. పోస్ట్లు పెడుతుంటాడు.

కృతిమ మేథ వల్ల జాబ్స్ పోతాయి అనుకోవడం మూర్కత్వం .

చీర్స్ .

... ఇదీ కొంతమంది మాట . ఆలోచన.

"ఉద్యోగాలు పోవు . లెక్కలు మిక్కుటంగా వస్తాయి . ఆందోళన వద్దు . కంగారొద్దు" అన్న మేథావులకు ఒక మాట

హ్యాపీగా కొడగు పందికూర, హైదరాబాద్ బిర్యానీ.. తిని ఉపర్ షేర్వాణీ తో ... అందర్ పేరేషానీ కాకుండా .. నాలుగు HPV వాక్ సీన్ లు గుచ్చుకొని బతకండి .

గేట్ల తాత జిందాబాద్ .

Read more Photos on
click me!

Recommended Stories