ధర ఎంత?
దీని ధర ఎంత అనే దానిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఓ అంచనా ప్రకారం ఒక్కో క్షిపణి ధర దాదాపు 35 మిలియన్ డాలర్లు అంటే రూ. 290 కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీని పూర్తి ప్రాజెక్టు వ్యయం సుమారు 85 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, ఉత్పత్తి వంటి అన్ని ఖర్చులు కలుపుకుంటే ఇంత మొత్తమవుతుందని అభిప్రాయపడుతున్నారు.