చదరంగం ఒక మంచి మైండ్ గేమ్. చాలా మంది ఈ ఆటను ఆడడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే ఓ దేశం మాత్రం చెస్ ను నిషేధించింది. ఇంతకీ చెస్ ను బ్యాన్ చేయడానికి అసలు కారణం ఏంటనేగా మీ సందేహం.
2016లో సౌదీ అరేబియా కూడా చదరంగంపై నిషేధం విధించింది, తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు తాలిబాన్లు కూడా అదే బాటలో నడుస్తూ చదరంగం ఆటని నిరవధికంగా నిషేధించారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తర్వాత క్రీడలతో సహా అనేక రంగాలపై ఆంక్షలు విధించారు. ఆరో తరగతి తర్వాత బాలికల చదువులను నిషేధించారు. మహిళలు క్రికెట్ ఆడటం కూడా నిషేధించారు.
25
ఆఫ్ఘనిస్తాన్ పుణ్య ప్రచార, పాప నిరోధక మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా చదరంగం ఆటని నిషేధించినట్లు ప్రకటించాయి. మే 11 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇకపై ఆఫ్ఘనిస్తాన్‌లో చదరంగం పోటీలు జరగవు. వినోదం కోసం కూడా చదరంగం ఆడకూడదు. ఈ నిషేధం నిరవధికంగా కొనసాగుతుంది.
35
ఆఫ్ఘనిస్తాన్ చదరంగ సమాఖ్యను పుణ్య ప్రచార, పాప నిరోధక మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇస్లామిక్ షరియా ప్రకారం చదరంగం 'హరామ్' అని వాళ్ళు చెబుతున్నారు. చదరంగం ఆడటం వల్ల సమయం వృధా అవుతుందని, మత సూత్రాలకు విరుద్ధమని వాళ్ళ వాదన.