ఇటీవల వివాహేతర సంబంధాలు ఎక్కువుతున్నాయి. భాగస్వాములను మోసం చేస్తూ వివాహ బంధానికే మచ్చ తెస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ మహిళ తన అపార్ట్‌మెంట్‌లో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారిద్దరూ సాన్నిహతంగా కలిసి ఉన్నారు. అయితే అంతలోనే భర్త ఇంటి గుమ్మానికి చేరుకుని డోర్ బెల్ కొట్టాడు.
25
అకస్మాత్తుగా భర్త రావడంతో
డోర్‌బెల్ మోగగానే, లోపల ఉన్న జంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రియుడు అర్థనగ్నంగా ఉండగా, భార్య ఏం చేయాలో తెలియని స్థితిలో పడింది. బయట భర్త ఆత్రుతగా "ఎందుకు తలుపు తీసడం లేదు?" అని అనుమానపడ్డాడు. చివరికి భర్తకు ఇంట్లో ప్రియుడు ఉన్నాడనే విషయం తెలిసింది.
35
ప్రియుడు తప్పించుకునే ప్రయత్నం
భర్త వచ్చాడన్న విషయం తెలిసిన వెంటనే ప్రియుడు తప్పించుకోవడానికి బాల్కనీ నుంచి దూకే ప్రయత్నం చేశాడు. అయితే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇతరులు ఇది గమనించి, బయటకు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను తప్పించుకోవాలని ప్రయత్నించినా, కొందరు దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు
ఈ ఘటనను అక్కడున్న కొందరు మొబైల్‌లో రికార్డు చేశారు. వెంటనే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. కొందరికి ఇది హాస్యంగా అనిపించగా, మరికొందరికి మోసం చేసిన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
55
సమాజాన్ని సంధిస్తోన్న ప్రశ్నలు
ఈ ఘటన సమాజంలో నమ్మకద్రోహం, వివాహ బంధానికి భంగం, నైతిక విలువల తగ్గుదలకు ఉదాహరణగా మారింది. కలకాలం కలిసి ఉంటామని వివాహం చేస్తున్న భాగస్వాములను మోసం చేస్తున్న తీరు చూస్తుంటే సమాజంలో బలహీనమవుతోన్న బంధాలకు సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వివాహేతర సంబంధాలు అనేవి చివరికి నష్టాన్నే మిగిలిస్తాయన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిందే.