ఏమిటీ... కిలో టమాటా ధర రూ.600-700..! ఎక్కడో తెలుసా?

Published : Oct 22, 2025, 03:16 PM IST

Tomato Price in Pakistan : పాకిస్థాన్ పాలకులు చేస్తున్న పాపాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్ఘానిస్తాన్ తో గొడవ కారణంగా పాక్ లో టమాటా ధర ఆకాశాన్నంటింది. కిలో ఎంతో తెలుసా? 

PREV
16
పాకిస్థాన్ పాపం పండింది.. అందుకే ఈ పరిస్థితి

Tomato Price : కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు... చేసిన పాపం ఊరికేపోదు అనడానికి పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితే పర్ఫెక్ట్ ఉదాహరణ. భారత్ చేతిలో చావుదెబ్బతిన్నా పాక్ కు ఇంకా బుద్దిరావడంలేదు... ఇప్పుడు పాపం పెద్దగా సైనికశక్తి లేని అప్ఘానిస్తాన్ పై పడింది. సామాన్య పౌరులపై యుద్ద విమానాలతో దాడులు చేస్తూ అప్ఘాన్ లో అరాచకం సృష్టిస్తోంది. ఇటీవల ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్లను పొట్టనబెట్టుకుందికూడా. ఇలా పాపం మూటగట్టుకుంటున్న పాక్ ఆ ప్రకృతే గుణపాఠం చెబుతోంది. పాక్ పాలకుల తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

26
పాకిస్థాన్ లో సంక్షోభం

పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది... దీనికి ప్రకృతి విపత్తులు తోడయ్యాయి. దీంతో పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్‌ లో టమాటా ధర ఊహకందని విధంగా పైపైకి ఎగబాకుతోంది... ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీతో సహా చాలా మిగతా నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా రూ.700కి అమ్ముడవుతోందని సమాచారం. మీరు వింటున్నది నిజమే... అక్షరాాలా కిలో ఏడువందల రూపాయలు.

36
ఆకాశాన్నంటిన టమాటా ధర

కొన్ని వారాల క్రితంవరకు ఇదే పాకిస్ధాన్ లో టమాటా కిలో రూ.100కి అమ్ముడైంది. కానీ ఇప్పుడు టమాట పేరెత్తేందుకే ప్రజలు భయపడే స్థాయికి చేరుకుంది. ఒకేసారి భారీగా ధరలు పెరగడం ఇప్పటికే కష్టాలతో సహవాసం చేస్తున్న పాకిస్థానీల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతోంది. అయితే పాకిస్థాన్ పాలకుల వల్లే ఇంత దారుణ పరిస్థితి వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్ఘాన్ తో ఘర్షణల కారణంగా వాణిజ్యం దెబ్బతింది... టమాటా ధరలు పెరగడానికి ఇదికూడా ఓ కారణమే అంటున్నారు.

46
చేజేతులా ఈ పరిస్థితి తెచ్చుకున్న పాక్

పాకిస్థాన్ సామా టీవీ ప్రకారం... దేశంలోని చాలా ప్రాంతాల్లో వచ్చిన వరదలు పంటలను నాశనం చేశాయి. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ నుండి పాకిస్థాన్‌కు టమాటా సరఫరా నిలిచిపోయింది. ఇలా ప్రకృతి విపత్తు, అప్ఘాన్ తో ఘర్షణ టమాటా ధరను అమాంతం పెంచిందని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే అప్ఘాన్ ఎగుమతులపై నిషేధం విధించింది పాకిస్థానే... ఈ నిర్ణయం ఆ దేశాన్నే సంక్షోభంలోకి నెడుతోంది.

56
ఇక్కడయితే కిలో టమాటా రూ.700

పాకిస్థాన్ అంతటా టమాటా ధరలు ఎక్కువగానే ఉన్నాయి.. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అయితే తారాస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్‌లోని జీలం, గుజ్రాన్‌వాలాలో టమాటా ధరలు విపరీతంగా పెరిగింది. జీలంలో టమాటా ధర కిలోకు ₹700కి చేరింది. అదే సమయంలో గుజ్రాన్‌వాలాలో టమాటా కిలోకు ₹575కి అమ్ముడవుతోంది.

66
పాకిస్థాన్ లో టమాటా ధరలు...

ఫైసలాబాద్‌లో కిలో టమాటా ధర ఒకేసారి ₹160 నుంచి ₹500కి పెరిగింది. ముల్తాన్‌లో టమాటా కిలోకు ₹450కి అమ్ముడవుతోంది. లాహోర్‌లో టమాటా కిలోకు ₹400కి అమ్ముడవుతోంది. అయితే ప్రభుత్వ అధికారిక ధరల జాబితా ప్రకారం గరిష్ట ధర కిలోకు ₹170గా నిర్ణయించారు. కానీ ఈ ధర ఎక్కడా అమలుకావడంలేదట.

ఇటీవల వరదలు టమాటా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇంతలో ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దవాతావరణం పరిస్థితిని మరింత దిగజార్చిందని... వాణిజ్య మార్గాలు మూసివేయడం టమాటా ధరలను మరింత పెంచిందని క్వెట్టా, పెషావర్‌లోని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories