H1B Visa: అమెరికాలో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు నిజ‌మైన దీపావ‌ళి.. హెచ్‌1 బీ వీసా ఫీజుపై కీల‌క ప్ర‌క‌ట‌న

Published : Oct 21, 2025, 09:39 AM IST

H1B Visa: అమెరికాలో విద్య‌న‌భ్య‌సించి ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న విదేశీ విద్యార్థులకు పెద్ద ఉపశమనం లభించింది. హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ఫీజు పెంపుపై అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ (USCIS) తాజాగా కీలక స్పష్టత ఇచ్చింది. 

PREV
15
కొత్త ఫీజు ఎవరికి వర్తిస్తుంది

USCIS ప్రకటన ప్రకారం, హెచ్‌–1బీ వీసా కోసం పెంచిన $1,00,000 (సుమారు రూ.83 లక్షలు) ఫీజు కేవలం దేశం బయట నుంచి దరఖాస్తు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, అమెరికా వెలుపల ఉండి ఉద్యోగం కోసం వీసా దరఖాస్తు చేసేవారు మాత్రమే ఈ మొత్తం చెల్లించాలి.

25
అమెరికాలో ఉన్న విద్యార్థులకు మినహాయింపు

ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న లేదా చెల్లుబాటు అయ్యే వీసా హోదాలో ఉన్నవారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎఫ్‌–1 విద్యార్థి వీసా కలిగి ఉన్నవారు హెచ్‌–1బీకి మారినా ఫీజు అవసరం లేదు. ఇప్పటికే హెచ్‌–1బీ వీసా కలిగి ఉన్నవారు తమ వీసాను పొడిగించుకోవాలనుకున్నా, సవరణలు కోరుకున్నా లేదా హోదా మార్చుకున్నా ఈ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, టెకీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

35
ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది

USCIS ప్రకారం, ఈ నిబంధన సెప్టెంబర్ 21న వెలువడిన నోటిఫికేషన్ తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

45
వివాదాస్పద నిర్ణయానికి స్పష్టత

ముందుగా ట్రంప్ ప్రభుత్వం అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు లభించాలని ఉద్దేశించి ఈ ఫీజు నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ నిర్ణయం వ్యాపార సంస్థలు, టెక్ కంపెనీలలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ‘యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వం తాజాగా ఈ ఫీజు ఎవరికి వర్తిస్తుందో స్పష్టత ఇచ్చింది.

55
భారతీయులపై ప్రభావం

2024లో జారీ అయిన హెచ్‌–1బీ వీసాలలో 70 శాతం భారతీయులే పొందారు. అందువల్ల ఈ కొత్త మార్గదర్శకాలు భారత విద్యార్థులు, టెకీలు, ఐటీ రంగ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. అయితే, అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఇకపై వారు అమెరికాలో నుంచే హెచ్‌–1బీకి దరఖాస్తు చేసుకునే అవకాశం పొందారు.

Read more Photos on
click me!

Recommended Stories