స్యయంగా తీసుకునే ఈ ఇంజెక్షన్‌లో కొన్ని క్రిస్టల్స్‌ను కలిపారు. ఇది చర్మం కింద ఏర్పడి, నెమ్మదిగా హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో గర్భధారణకు అవసరమైన అండం విడుదల కావడం ఆగిపోతుంది. సులభంగా ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు. వైద్యుల సహాయం లేకుండానే, మహిళలు ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దీని ప్రభావం ఎక్కువకాలం ఉండటంతో, రోజూ మాత్రలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటలో ఉన్న గర్భనిరోధక ఇంప్లాంట్లు సంవత్సరాల పాటు పనిచేస్తాయి. కానీ వీటిని శస్త్రచికిత్స ద్వారా వైద్యులు శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. అదే విధంగా గర్భనిరోధక ఇంజెక్షన్లు కేవలం మూడు నెలల పాటు మాత్రమే పనిచేస్తాయి. కానీ ఈ కొత్త ఇంజెక్షన్‌ని ఈ రెండు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ఇంజక్షన్‌ను ఇప్పటి వరకు మనుషులపై పరీక్షించలేదు. అయినా, శాస్త్రవేత్తలు దీని ప్రభావంపై విశ్వాసంతో ఉన్నారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో, ఈ డ్రగ్ కనీసం 97 రోజులు ప్రభావం చూపించింది. ఫార్ములేషన్ మార్పులతో దీని ప్రభావాన్ని ఇంకా ఎక్కువ రోజులు నిలిపే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
pregnancy kit
నేచర్ కెమికల్ ఇంజనీరింగ్ అనే జర్నల్‌లో ప్రచురించి అధ్యయనం ప్రకారం ఈ ఇంజక్షన్ ద్వారా మందును దీర్ఘకాలం విడుదల చేసే సామర్థ్యం వస్తుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర గర్భనిరోధక ఇంజెక్షన్ల కంటే చాలా కాలం ప్రభావం చూపుతుంది. పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జియోవన్ని ట్రావెర్సో మాట్లాడుతూ.. ఈ పరిశోధన అసలు లక్ష్యం ఇంట్లో సులభంగా ఉపయోగించుకునేలా ఇంజెక్షన్ తయారు చేయడమే అని తెలిపారు. ఇంజక్షన్ తీసుకున్నా తక్కువ నొప్పి కలుగుతుందని చెప్పుకొచ్చారు.
రోజూ ట్యాబ్లెట్స్ వేసుకోవడంకంటే ఈ విధానం చాలా వరకు మంచిదని ట్రావెర్సో అభిప్రాయపడుతున్నారు. ఈ ఇంజన్ కుటుంబ నియంత్రణకు కొత్త ఎంపికగా ఉపయోగపడుతుందని తక్కువ వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఇంజక్షన్ విధానం కేవలం గర్భనిరోధానికే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. హెచ్‌ఐవీ, క్షయవ్యాధి (TB), స్కిజోఫ్రీనియా, దీర్ఘకాల నొప్పి, ఇతర మెటబాలిక్ వ్యాధులకు పని చేస్తుందని భావిస్తున్నారు.
ఈ టెక్నాలజీపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు క్లీనికల్ ప్రయోగాలకు అనువైన స్కిన్ ఎన్‌వైరన్‌మెంట్‌లో దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధునాతన పరిశోధనలు ప్రారంభిస్తున్నారు.