Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్

Published : Oct 19, 2026, 07:15 PM IST

Sadhguru: మనం తింటున్న ఈ ఆహారం..భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు దక్కదా? ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోవడంపై సద్గురు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై ఇక 60 పంటలు మాత్రమే పండించగలమని చెబుతూ దేశాలన్నీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

PREV
15
మట్టి సారంపై సద్గురు ఆందోళన

మనం తింటున్న ఈ ఆహారం..భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు దక్కదా? ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటంపై సద్గురు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై ఇక 60 పంటలు మాత్రమే పండించగలమని చెబుతూ, మట్టిని కాపాడేందుకు దేశాలన్నీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

25
భూమిపై ఇక 60 పంటలు మాత్రమే

మలేషియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సద్గురు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కౌలాలంపూర్‌లోఅక్టోబర్ 7న 'చైతన్యవంతమైన ప్రపంచ నిర్మాణం' అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సద్గురు.. ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం వేగంగా తగ్గిపోతుండటం వల్ల భవిష్యత్తులో ఆహార ఉత్పత్తి, భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించి వివరించారు. ఈ భూమిపై ఇక 60 పంటలు మాత్రమే పండించగలమని, ఆ తర్వాత ఆహారం పండించడం చాలా కష్టంగా మారుతుందని ఐరాస చెప్పినట్లు సద్గురు తెలిపారు.

35
పుట్టబోయే పిల్లల ఆహారాన్ని తింటున్నాం

మనం మన ఆహారాన్ని కాకుండా ఇంకా పుట్టని పిల్లలకు చెందాల్సిన ఆహారాన్ని లాగేసుకుంటున్నామని, ఇది అస్సలు మంచిది కాదని సద్గురు అన్నారు. అంటే మహా అయితే మరో 40 నుంచి 45 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం చాలా కష్టంగా మారుతుందని తెలిపారు.

45
మట్టిని కాపాడే విధానాలు రావాలి

నిజం చెప్పాలంటే, ఇంకా పుట్టని పిల్లల ఆహారాన్ని మనం ఇప్పుడు తినేస్తున్నామని. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. మనం మన తిండిని గానీ, మన పిల్లల తిండిని గానీ తినడం లేదు. భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు చెందాల్సిన ఆహారాన్ని మనం లాగేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి దయచేసి మట్టిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోండని సూచించారు. ప్రతి దేశంలోనూ మట్టి సారాన్ని పెంచేలా కొత్త విధానాలు రావాలని, దీనిపై ప్రజలు పాలకులను నిలదీయాలని సద్గురు పిలుపునిచ్చారు.

ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రతి దేశంలోనూ విధానాలు మారాలన్నారు. ఆయా దేశాల్లోని నేల సారాన్ని పెంచేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలని కోరారు. మట్టి ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా విధాన నిర్ణేతలను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు.

55
192 దేశాలకు మట్టి సంరక్షణ విధానాలు

దాదాపు నాలుగేళ్ల క్రితం మేం రూపొందించిన మలేషియా మట్టి సంరక్షణ విధానాన్ని మీకు ఇస్తున్నాం. దాన్ని మీ దేశ ప్రధాని, వ్యవసాయ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రులకు అందజేయండి.

ఇలాగే ప్రపంచంలోని 192 దేశాలకు సరిపోయేలా మట్టి సంరక్షణ విధానాలను రూపొందించడానికి మాకు 2 నుంచి రెండున్నరేళ్ల సమయం పట్టిందని సద్గురు అన్నారు. ప్రతి దేశ భౌగోళిక పరిస్థితులు, మట్టి స్వభావం, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ పద్ధతులను బట్టి వీటిని తయారు చేసినట్లు తెలిపారు. వీటిని ఇప్పటికే 72 నుంచి 74 దేశాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఆమోదించాయని సద్గురు చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories