Richest Person: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. ఆయన వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల (1,000 బిలియన్ డాలర్లు) మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.
మస్క్‌కు చెందిన SpaceX కంపెనీ షేర్లు మార్కెట్లో భారీగా పెరగడంతో సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరింది. కంపెనీలో మస్క్‌కు ఉన్న భారీ వాటా కారణంగా ఆయన వ్యక్తిగత నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన వ్యక్తిగా మస్క్ పేరు నమోదైంది. ఈ భారీ సంపద పెరుగుదలకు ప్రధాన కారణం స్పేస్‌ఎక్స్ కంపెనీ విలువ ఒక్కసారిగా పెరగడమేనని నివేదికలు చెబుతున్నాయి.
25
174 దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ సంపద
ప్రపంచంలో కేవలం కొద్ది దేశాలకే 1 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీ ఉంది. మస్క్ సంపద ప్రస్తుతం సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండటంతో, ప్రపంచంలోని దాదాపు 174 దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తి కంటే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
35
తైవాన్, దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే..
ఆసియాలో ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా గుర్తింపు పొందిన తైవాన్ వార్షిక జీడీపీ సుమారు 976 బిలియన్ డాలర్లుగా అంచనా. మస్క్ సంపద దానికంటే ఎక్కువగా ఉంది. అలాగే ఆయన జన్మస్థలం అయిన సౌత్ ఆఫ్రికా జీడీపీ సుమారు 480 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండగా, మస్క్ సంపద దానికి రెండింతలకు పైగానే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
మస్క్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం స్విట్జార్లాండ్, స్వీడన్, సింగపూర్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రీయా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాల వార్షిక జీడీపీలను కూడా అధిగమించినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
55
భారత్‌తో పోలిస్తే ఎంత?
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. భారత జీడీపీ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండగా, మస్క్ సంపద దాదాపు దాని నాలుగో వంతుకు సమానంగా ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి సంపదే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు సమానంగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.