Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?

Published : Jan 09, 2026, 01:00 PM IST

Petrol Price: భార‌త‌దేశంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఎప్పుడో సెంచ‌ర్ కొట్టేసింది. పెట్రోల్ బంక్ వైపు వెళ్లాలంటేనే ద‌డుసుకునే ప‌రిస్థితి అయితే ఓ దేశంలో మాత్రం లీట‌ర్ పెట్రోల్ కేవ‌లం రూపాయికే ల‌భిస్తుంద‌నే విష‌యం తెలుసా.? 

PREV
15
రూపాయికే లీటర్ పెట్రోల్…

భారత్‌లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటితే సాధారణ ప్రజలు వాహనం బయటకు తీయాలంటే రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఒక దేశంలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర ఒక్క రూపాయి మాత్రమే. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం. అపారమైన చమురు సంపద ఉన్న వెనిజులాలో ఈ అతి తక్కువ ధరలు సాధ్యమయ్యాయి.

25
చమురు సంపదతో ప్రపంచంలో అగ్రస్థానం

వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ చమురు నిల్వలు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. అంచనాల ప్రకారం అక్కడ 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఈ సంఖ్య సౌదీ అరేబియాను కూడా దాటుతోంది. ఇంత భారీ ఇంధన వనరులు ఉండటమే వెనిజులాను అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక దేశంగా మార్చింది.

35
అమెరికా సైనిక చర్యతో రాజకీయ కలకలం

ఇటీవల వెనిజులాలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేసిన విష‌యం తెలిసిందే. అమెరికా చేపట్టిన సైనిక చర్య సంచలనంగా మారింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కారాకస్‌లో అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు త‌ర‌లించింది. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం ఆరోపణలపై ఆయనపై అమెరికాలో విచారణ జరుగుతోంది.

45
చమురు నియంత్రణే అసలు లక్ష్యమా?

ఈ సైనిక చర్య వెనుక అసలు కారణం వెనిజులా చమురు వనరులేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు నేరుగా జోక్యం చేసుకోవడం ద్వారా ఇంధన వనరులపై ప్రభావం చూపాలన్నదే ప్రధాన ఉద్దేశమని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

55
వెనిజులాలో పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు త‌క్కువ‌.?

వెనిజులాలో ప్రభుత్వం ప్రజలకు భారీ సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీ పెట్రోల్ ధర లీటరుకు రూ.1 నుంచి రూ.3 మధ్యే ఉంటుంది. దీంతో రూ.100 ఖర్చు చేస్తే కారు ట్యాంక్ నిండిపోతుంది. అక్కడ రెండు రకాల ధరలు అమల్లో ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రజలకు సబ్సిడీ రేటు. రెండోది ప్రీమియం పెట్రోల్. ప్రీమియం ధర కూడా భారత ధరలతో పోలిస్తే చాలా తక్కువగా రూ.42 దగ్గరే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories