Pakistan Payments: భారత్‌లో డిజిటల్ పేమెంట్ యాప్స్ రోజువారీ జీవితాల్లో భాగమైపోయాయి. కానీ పాకిస్తాన్‌లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. అక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ ఉన్నా, వాటి వ్యవస్థ భారతదేశంతో పోలిస్తే వేరుగా ఉంటుంది.
పాకిస్తాన్‌లో భారతీయ పేమెంట్ యాప్‌లు పని చేస్తాయా.?
భారత్‌లోని పేమెంట్ యాప్‌లు అన్నీ UPI (యూపీఐ) ఆధారంగా పనిచేస్తాయి. కానీ ఈ సిస్టమ్ పాకిస్తాన్‌లో లేదు. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా వేరుగా ఉండటం వల్ల పేటీఎమ్, ఫోన్‌పే వంటి యాప్‌లు అక్కడి బ్యాంక్‌లతో కనెక్ట్ కావు. గూగుల్ పే మాత్రం కొంతవరకు కార్డ్ ఆధారిత సేవలు అందిస్తున్నా, పూర్తి స్థాయి యూపీఐ లాంటి సేవలు ఇవ్వడం లేదు.
25
పాకిస్తాన్‌కి సొంత డిజిటల్ పేమెంట్ సిస్టమ్
భారత్‌లో యూపీఐ ఉన్నట్లే, పాకిస్తాన్‌లో కూడా రాసట్ (Raast) అనే ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ Raast ద్వారా మొబైల్ నంబర్‌తోనే డబ్బులు పంపించవచ్చు, వెంటనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది, సింపుల్‌గా మనీ రిసీవ్ చేయవచ్చు. ఇది యూపీఐ లాగే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా అభివృద్ధి చెందింది.
35
పాకిస్తాన్‌లో ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్‌లు
భారత్‌లో Paytm, PhonePe ఉన్నట్లే పాకిస్తాన్‌లో కూడా కొన్ని ప్రముఖ యాప్‌లు ఉన్నాయి: వీటిలో జాజ్‌క్యాష్ ప్రధానమైంది. దీనికి 4 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇందులో బిల్లు చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలు పొందొచ్చు. ఇక ఈజీ పైసా యాప్‌ను గ్రామాలు, పట్టణాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ సేవలను టెలినార్ సంస్థ ప్రారంభించింది. ఇక పాకిస్థాన్‌లో సాడాపే, నయాపే వంటి కొన్ని ఫిన్‌టెక్ కంపనీలు కూడా ఉన్నాయి. వీటికి యువతలో వేగంగా ఆదరణ లభిస్తోంది.
పాకిస్తాన్‌లో కూడా డిజిటల్ పేమెంట్స్ విధానం కొంతవరకు భారత్‌లాగే ఉంటుంది. QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్, మొబైల్ వాలెట్ ద్వారా డబ్బులు పంపడం, యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించడం వంటివి పట్టణాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
55
ఇంకా నగదు రూపంలోనే
అయితే డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా కూడా పాకిస్తాన్‌లో చాలా ప్రాంతాల్లో ఇంకా క్యాష్ ప్రాధాన్యంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సదుపాయాలు తక్కువగా ఉంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా క్యాష్ ఆన్ డెలివరీని ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల డిజిటల్ మార్పు జరుగుతున్నా, పూర్తిగా క్యాష్ లేని సమాజం ఇంకా ఏర్పడలేదు.