Flying Taxi: గంట‌లో హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లొచ్చు.. తొలి ఫ్ల‌యింగ్ టాక్సీ స్టేష‌న్ సిద్ధం

Published : Apr 17, 2026, 02:09 PM IST

Flying Taxi: హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌ గంట‌లో వెళ్తే భ‌లే ఉంటుంది క‌దూ! ఆశ్చ‌ర్యంగా ఉన్నా త్వ‌ర‌లోనే ఇది నిజం కానుంది. దుబాయ్ ప్రపంచానికి కొత్త ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీని పరిచయం చేసింది.తొలి పూర్తి స్థాయి ఫ్లయింగ్ టాక్సీ స్టేషన్ నిర్మించింది. 

PREV
13
ఫ్లయింగ్ టాక్సీ స్టేషన్ ప్రత్యేకతలు

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నిర్మించిన ఈ స్టేషన్‌కు దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వెర్టిపోర్ట్ (DXV) అని పేరు పెట్టారు. దీనిని మొత్తం 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. నాలుగు అంతస్తుల భవనం, రెండు టేకాఫ్ & ల్యాండింగ్ ప్యాడ్లు, ఎలక్ట్రిక్ టాక్సీల కోసం ఛార్జింగ్ సదుపాయం, రెండు స్థాయిల కార్ పార్కింగ్, ప్రయాణికుల కోసం ఎయిర్ కండిషన్ సదుపాయం వంటివి ఇందులో ఏర్పాటు చేశారు.

23
ప్రయాణ సమయం, ఖర్చు ఎలా ఉంటుంది?

ఫ్లయింగ్ టాక్సీ సేవలు ప్రారంభమైతే ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది. కారులో 45 నిమిషాలు ప‌ట్టే దూరం ఫ్లయింగ్ టాక్సీతో కేవలం 10–12 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. ఖ‌ర్చు కూడా ఉబ‌ర్ బ్లాక్ రైడ్ లాంటి స్థాయిలో ఉంటుంద‌ని అంటున్నారు. ఒక టాక్సీలో పైలట్‌తో పాటు 4 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు. ఈ టాక్సీలు గంటకు సుమారు 300 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తాయి. ఈ లెక్క‌న ఈ సేవ‌లు మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తే హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు కేవ‌లం గంట‌లోపే వెళ్లిపోవ‌చ్చ‌న్నామ‌.

33
ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసే టెక్నాల‌జీ

ఈ ఫ్లయింగ్ టాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు. గాల్లో ప్రయాణ సమయంలో కాలుష్యం ఉండదు. శబ్దం తక్కువగా ఉంటుంది. ఆధునిక AI టెక్నాలజీతో పని చేస్తాయి. ఇవి భవిష్యత్తు ట్రాన్స్‌పోర్ట్‌గా భావిస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ద్వారా. మెట్రో, బస్సులు, స్మార్ట్ మొబిలిటీతో కలిపిన సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అలాగే వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణంతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి లక్ష్యాలను సాధించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే, ఎయిర్ టాక్సీ సర్వీసులు అందించే ప్రపంచంలో తొలి నగరంగా దుబాయ్ నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories