Viral News: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు ఇస్లామాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు అత్యంత భద్రత కలిగిన సెరెనా హోటల్ ఇస్లామాబాద్‌లో జరిగాయి. ఈ చర్చల నేపథ్యంలో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
ఈ చర్చల కోసం సెరెనా హోటల్‌ను ఎంపిక చేయడం వెనుక భద్రత ప్రధాన కారణం. ప్రధాని కార్యాలయం, పార్లమెంట్ సమీపంలో ఉండటం వల్ల ఇది సురక్షితంగా భావించారు. 15 ఎకరాల విస్తీర్ణం, 400కి పైగా గదులు, పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్‌తో ఇది భారీ డెలిగేషన్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ లెవెల్ సదుపాయాలు ఉంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో “ఇంత పెద్ద మీటింగ్… బిల్లు ఎంత వస్తుందో?” అన్న చర్చ మొదలైంది. కాగా ఈ సమావేశానికి అమెరికా నుంచి జేడీ వాన్స్ నేతృత్వంలో డెలిగేషన్, ఇరాన్ అధికారులు పాల్గొన్నారు. చర్చల ముందు నగరాన్ని పూర్తిగా సెక్యూరిటీ కవర్ చేశారు. రెండు రోజుల పాటు షాపులు, ఆఫీసులు మూసివేయగా, వేలాది సైనికులు రెడ్ జోన్ ప్రాంతంలో మోహరించారు. మొత్తం చూసుకుంటే… ఇది చర్చల వాతావరణం కంటే ఎమర్జెన్సీ పరిస్థితిలా కనిపించింది.
24
పరేష్ రావెల్ సెటైర్ కామెంట్
హోటల్ బిల్లుల గురించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు రవాల్ ఇచ్చిన సమాధానం వైరల్ అయింది. “బిల్లు ఎవరు చెల్లిస్తారు?” అన్న ప్రశ్నకు ఆయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Monetary Fund) అని చెప్పడం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇది కేవలం జోక్ మాత్రమే కాదు, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఒక గట్టిగా వేసిన సెటైర్. ఎందుకంటే పాకిస్థాన్ చాలా కాలంగా IMF రుణాలపై ఆధారపడుతోంది.
34
21 గంటల చర్చలు… ఫలితం శూన్యం
అమెరికా–ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా, చివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అమెరికా తమ ఫైనల్ ఆఫర్ ఇచ్చినా, ఇరాన్ నుంచి అణ్వస్త్రాలపై స్పష్టమైన హామీ రాలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ చర్చల వల్ల పెద్ద మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ మధ్యవర్తిగా ప్లాట్ ఫామ్ కల్పించినా, ఫలితం మాత్రం సున్నాగా మారింది.
పాకిస్థాన్ ఆర్థికంగా ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉంది. IMF నుంచి వరుసగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. 2024లో సుమారు 7 బిలియన్ డాలర్ల సహాయం కూడా తీసుకుంది. విదేశీ మారక నిల్వలు ఒత్తిడిలో ఉండగా, అప్పులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారీ అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం గౌరవంగా కనిపించినా, ఖర్చుల విషయంలో మాత్రం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అందుకే నెటిజన్లు సెటైరిక్‌గా “హోస్ట్ పాకిస్థాన్… స్పాన్సర్ IMF!” అని కామెంట్లు చేస్తున్నారు.