1. ఇజ్రాయెల్ :
తమ దేశానికి ప్రమాదంగా మారే శత్రువులను ఇజ్రాయెల్ ఏమాత్రం ఉపేక్షించదు. ఎంతటి బలమైన శత్రువులకైనా ధీటుగా సమాధానం చెబుతుంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకునే దేశంగా ఇజ్రాయెల్ పరిగణించబడుతుంది.
ఇజ్రాయిలే విధానమే 'No Compromise With Terror' (ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం). 1972 మ్యూనిచ్ ఒలింపిక్ దాడి తర్వాత ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్' నిర్వహించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రీడాా ఈవెంట్ పై దాడికి పాల్పడి క్రీడాకారులు, భద్రతా సిబ్బంది పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు మాజీ ప్రధాని గోల్డా మెయిర్ ఈ ఆపరేషన్ చేపట్టారు.