ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉండటంతో సెర్చ్, రెస్క్యూ బృందాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులు, భద్రతా సిబ్బంది కూడా నదుల పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నేపాల్‌లో పరిస్థితి విషమంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలోనే 132 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు కొత్త సరస్సు రూపంలో మరో ముప్పు ఎదురవడంతో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే కొన్ని రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.