
DNA Tests : అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ తనకు పుట్టలేదని తెలిస్తే..? భార్య వేరే ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుని ఈ బిడ్డను కన్నదని... ఆ బిడ్డకు తనను తండ్రిగా ప్రపంచానికి పరిచయం చేసిందని తెలిస్తే..? ఆ మగాడి బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితి ఒకరిద్దకి వస్తే అది సాధారణం... ఓ దేశం మొత్తం ఇలాంటి పరిస్థితే వస్తే అది అసాధారణం. ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది.
ఉగాండాలో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని కంపాలాలో ఓ విద్యావేత్తకు ఎందుకో తన భార్యపై అనుమానం వచ్చింది... ముగ్గురు బిడ్డల్లో ఒకరికి తాను తండ్రి కాదని భావించాడు. వెంటనే బిడ్డకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించగా అతడి అనుమానమే నిజమయ్యింది. ఆ బిడ్డకు అతడికి పుట్టలేదని తేలింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా బాగా వైరల్ గా మారింది..
ఈ ఘటన తర్వాత చాలామంది పురుషులకు భార్యలపై అనుమానం పెరిగిపోయింది... తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అసలు తమకే పుట్టారా అన్న అనుమానం పెరిగింది. దీంతో డిఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇలా పరీక్షలు చేయిస్తున్నవారిలో 98 శాతం డిఎన్ఏ మ్యాచ్ అవడంలేదట... అంటే ఆ బిడ్డలకు ఇతడు తండ్రి కాదన్నమాట.. ఇంకెవరో అన్నట్లు.
ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇదే. డిఎన్ఏ టెస్టులు ఏ స్థాయిలో పెరిగాయంటే ప్రభుత్వం ఇలాంటి టెస్టులపై ఆంక్షలు విధిస్తోంది. భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగివుండాలని... అప్పుడే సంసారాలు సాఫీగా సాగుతాయని సలహా ఇస్తోంది ప్రభుత్వం. కానీ ప్రజలు మాత్రం డిఎన్ఏ టెస్టులవైపే మొగ్గుచూపుతున్నారు.
భర్తను చీట్ చేసి మరొకరితో బిడ్డల్ని కనడం ఏమిటి...? అంటూ ఉగాండా మహిళల క్యారెక్టర్ ను డిసైడ్ చేయకూడదు. అసలు వీళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుంటే తప్పు ఎవరిదో తెలిసింది. పురుషాధిక్య సమాజం, కట్టుబాట్ల కారణంగానే ఉగాండాలో ఈ పరిస్థితి వచ్చింది.
ఉగాండా సాంప్రదాయం ప్రకారం... మహిళ అన్నాక తప్పకుండా బిడ్డను కనాలి. ఒకవేళ భర్తలో ఏదైనా లోపం ఉండి బిడ్డకు జన్మనివ్వలేకపోయినా భార్యకే శిక్ష. తమకు వంశాంకురాన్ని ఇవ్వలేని అసమర్ధురాలిగా ముద్రవేసి అత్తింటివారు ఆమెను ఇంటినుండి పంపించేవారు. అంటే బిడ్డకు జన్మనివ్వకుండే భర్తతో విడాకులే అన్నట్లు. ఈ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు మహిళలు ఎలాగైన బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు... ఈ క్రమంలోనే ఇతరులతో బిడ్డను కంటున్నారు.
ఇంతకాలం గుట్టుగా సాగిన వ్యవహారం తాజాగా బయటకు వస్తోంది... ఒక్కొక్కరుగా భర్తలు బయటకు వచ్చి తమ పిల్లలేనా కాదా అని డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఉగాండాలో కాపురాలు కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది... భార్యాభర్తల అనుబంధానికి మచ్చలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ఉగాండాలో ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య డిఎన్ఏ టెస్టులు చిచ్చు పెడుతున్నాయి. ఈ క్రమంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు మతపెద్దలు రంగంలోకి దిగారు. డిఎన్ఏ పరీక్షలు వద్దని... భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగివుండాలని సూచిస్తున్నారు. ''పిల్లలు ఎలా పుట్టినా వాళ్లు ఆ ఇంటివారే... ఇదే సాంప్రదాయం అనాది నుండి వస్తోంది.. దాన్ని పాటించాలి. ఎవరూ డిఎన్ఏ టెస్టుల జోలికి వెళ్లరాదు'' అని మతపెద్దలు సూచిస్తున్నారు.