మిస్ యూనివర్స్ 2025గా ఫాతిమా... ఎవరీ అందాల ముద్దుగుమ్మ?

Published : Nov 21, 2025, 10:07 AM ISTUpdated : Nov 21, 2025, 10:57 AM IST

Miss Universe 2025 : మిస్ యూనివర్స్ 2025 గా మెక్సికన్ భామ ఫాతిమా భాష్ నిలిచారు. భారతీయ యువతి మణిక ఫైనల్ కు చేరినా కిరీటాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. 

PREV
14
మిస్ యూనివర్స్ గా మెక్సికన్ భామ

Miss Universe 2025 : థాయిలాండ్ లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికన్ సుందరి ఫాతిమా భాష్ (Fatima Bosch) అందాల కిరీటాన్ని ధరించింది. ఇవాళ (నవంబర్ 21, శుక్రవారం) ఉదయం జరిగిన గ్రాడ్ ఫినాలేలో పలు దేశాలు ముద్దగుమ్మలు కిరీటంకోసం పోటీపడ్డారు... అందరినీ వెనక్కినెట్టి మెక్సికోకు చెందిన ఫాతిమా 74వ మిస్ యూనివర్స్ టైటిల్ ను దక్కించుకున్నారు.

24
మిస్ యూనివర్స్ 2025 ఫాతిమా ఎమోషనల్

మెక్సికోకు చెందిన ఫాతిమాను మిస్ యూనివర్స్ 2025 గా ప్రకటించగానే ఆమె ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత 73వ మిస్ యూనివర్స్, డెన్మార్క్ కు చెందిన విక్టోరియా విజేత ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. ఇలా గత పదిహేను ఇరవై రోజులుగా థాయిలాండ్ లో జరుగుతున్న ఫోటీలు ముగిశాయి.

34
మిస్ యూనివర్స్ ఫైనల్లో ఇండియా మోడల్ మణిక

మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 130 దేశాలకు చెందిన అందమైన మోడల్స్ పాల్గొన్నారు. కొద్దిరోజులుగా థాయిలాండ్ లోని నొంతబూరిలో పలు రౌండ్లలో వీళ్లంతా పోటీపడ్డారు. చివరకు కొంతమంది మాత్రమే ఫైనల్స్ కు చేరారు... వీరిలో భారత యువతి మణిక విశ్వకర్మ కూడా కూడా ఉన్నారు. అయితే చివరివరకు గట్టి పోటీ ఇచ్చినా కిరిటాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది మణిక. మెక్సికో మోడల్ ఫాతిమా విజేతగా నిలిచింది.

44
మిస్ యూనివర్స్ కు దక్కే ఫ్రైజ్ మనీ ఎంత?

మిస్ యూనివర్స్ విజేతగా నిలిచిన ఫాతిమాకు దాదాపు రూ.2.21 కోట్లు అంటే 250000 డాలర్లు ప్రైజ్ మనీగా దక్కే అవకాశం ఉంది. అలాగే మిస్ యూనివర్స్ గా ఆమెకు వివిధ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇలా లభించిన పబ్లిసిటీతో ఆమెకు వివిధ ఎండార్స్ మెంట్స్ ద్వారా భారీ ఆదాయం లభించే అవకాశాలుంటాయి. ఇలా మిస్ యూనివర్స్ 2025 విజయంతో ఫాతిమా జీవితమే మారిపోనుంది.

Read more Photos on
click me!

Recommended Stories