భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్దం జరిగేది ... ఏం చెప్పి ఆపానో తెలుసా? : ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

Published : Nov 20, 2025, 05:29 PM IST

Donald Trump : ఇంతకాలం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దాన్ని ఆపింది తానే అని చెప్పుకుంటూ వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఇరుదేశాలను గట్టిగా బెదిరించి యుద్దాన్ని విరమించేలా చేశానని చెబుతున్నారు. ఏమని బెదిరించారంట తెలుసా?

PREV
16
భారత్-పాక్ యుద్దాన్ని ఆపింది నేనే : ట్రంప్

India Pakistan War : 'భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దాన్ని ఆపింది నేనే'... చాలాకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలివే. భారత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాలకు చెప్పుకుంటూ తిరగడం ఆపడంలేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి యుద్దం కాదు అణుయుద్దాన్ని ఆపాను.. టారీప్స్ వేస్తానని భయపెట్టడంతో ఇరుదేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.

26
అణు యుద్దానికి సిద్దమైన భారత్, పాక్ : ట్రంప్

భారత్, పాకిస్థాన్ దాదాపు అణుయుద్ధానికి సిద్దమయ్యాయి... ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటానని రెండు దేశాలను హెచ్చరించినట్టు ట్రంప్ చెప్పారు. బుధవారం యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ పాల్గొన్నారు... ఈ సందర్భంగానే మరోసారి భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావించాడు. తాను కలగజేసుకోకుంటే భారత్, పాక్ ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం జరిగేది... అలా జరక్కుండా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించానని ట్రంప్ అన్నారు.

36
ప్రతి దేశంపై 350 శాతం టారిఫ్ విధిస్తా..: ట్రంప్

"ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ అణ్వాయుధాలతో దాడికి సిద్ధమయ్యాయి. ఈ సమయంలో ఇరు దేశాధినేతలతో నేను మాట్లాడారు... సరే మీరు దాడి చేసుకోండి… కానీ నేను ప్రతి దేశంపై 350 శాతం టారిఫ్ విధిస్తున్నాను. అంతేకాదు అమెరికాతో ఇకపై వాణిజ్యం ఉండదు" అని హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు.

అయితే తన మాటలతో బయపడిపోయిన ఓ దేశం "వద్దు వద్దు, మీరు అలా చేయవద్దు" అని బ్రతిమాలిందని ట్రంప్ తెలిపారు. "నేను టారీఫ్స్ వేస్తాను. నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను వాటిని తొలగిస్తాను. మీరు ఒకరిపై ఒకరు అణ్వాయుధాలు ప్రయోగించుకుని, లక్షలాది మందిని చంపుతామంటే ఊరుకోను. అణు ధూళి లాస్ ఏంజిల్స్‌పై తేలియాడటాన్ని నేను అంగీకరించను. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను" అని హెచ్చరించినట్లు ట్రంప్ వెల్లడించారు.

46
తనలా శాంతిని ఏ అధ్యక్షుడు కోరుకోలేదు : ట్రంప్

''భారత్, పాకిస్థాన్ ముందు వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. మాకు ఇది నచ్చలేదు అన్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను పట్టించుకోను. మీ తీరు మారకుంటే టారీప్స్ వేయడం పక్కా. యుద్ధాన్ని ఆపకుంటే 350 శాతం టారిఫ్ విధిస్తాను. మీరు యుద్దం ఆపితే మనం ఒక మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుందాం" అని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

"తనలా యుద్దాలను ఆపడం ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు చేయలేదు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లాంటి వ్యక్తికి మనం ఏ దేశాల గురించి మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అతనికి ఎలాంటి ఆలోచన ఉండేది కాదు. దేనిపైనా టారిఫ్‌లు ఉండేవి కావు. ప్రపంచం మొత్తం నాశనమయ్యేది" అని ట్రంప్ అన్నారు.

56
ఇరు దేశాల ప్రధానులు నాకు ఫోన్ చేశారు..: ట్రంప్

అనేక వివాదాలను పరిష్కరించడంలో టారిఫ్‌లు కీలక పాత్ర పోషించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత్, పాక్ వివాదాలను పరిష్కరించడానికి కూడా టారిఫ్‌లను ఉపయోగించానని పేర్కొన్నారు. ఎనిమిదింటిలో ఐదు ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, టారిఫ్‌ల కారణంగా పరిష్కారమయ్యాయన్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి (షెహబాజ్ షరీఫ్) తనకు ఫోన్ చేసి యుద్దం ఆపినందుకు ధన్యవాదాలు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్, పాకిస్థాన్ యుద్దాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ కూడా తనకు ఫోన్ చేశారని... ఎలాంటి యుద్దానికి వెళ్లడంలేదని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ''చాలా మంచిమాట చెప్పారు. మనం ఒక ఒప్పందం చేసుకుందాం అని చెప్పాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

66
భారత్ ఖండన, ట్రంప్‌కు పాక్ క్రెడిట్

భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన స్వల్ప ఘర్షణ ఇరుపక్షాల ప్రత్యక్ష చర్చల తర్వాత ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడంలో సహాయపడ్డానని ట్రంప్ పదేపదే చెప్పారు. అయితే భారత్ మూడో పక్షం ప్రమేయాన్ని స్థిరంగా ఖండిస్తూ వస్తోంది. ఘర్షణ సమయంలో అమెరికా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయపడిందంటూ పాకిస్థాన్ బహిరంగంగా ట్రంప్‌కు క్రెడిట్ ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories