ఎంతకు తెగించ్చార్రా .. ఆన్లైన్ టెర్రరిస్ట్ కోర్సులా..! అదీ అమ్మాయిలకా..!!

Published : Oct 22, 2025, 05:57 PM IST

Tufat al Mominat : భారతదేశంలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ఆన్లైన్ లో రకరకాల కోర్సులు, ప్రత్యేక క్లాసులు అందించడం చూస్తుంటాం. కానీ పక్కదేశం పాకిస్థాన్ లో ఆన్లైన్ టెర్రరిస్ట్ కోర్సులు అందిస్తున్నారట.  

PREV
15
మరింత దిగజారిన పాకిస్థాన్

Online Terrorist Course : ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి పాకిస్థాన్ మన ఆలోచనే తప్పని నిరూపిస్తోంది... మరింత దిగజారిపోతోంది. ఈ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రతి ఒక్కరికి తెలుసు... కానీ ప్రపంచ వేదికలపై ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని సిగ్గులేకుండా చెప్పుకుంటుంది. దొంగే వేరేవారిని దొంగ అన్నట్లుగా చుట్టపక్కల దేశాలే తమదేశంలో హింసను ప్రేరేపిస్తున్నాయని ఇంతకాలం భారత్, ఇప్పుడు అప్ఘానిస్తాన్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది పాక్. అయితే తాజాగా పాకిస్థాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తెలియజేసే ఆసక్తికర వ్యవహారం ఒకటి వెలుగుచూసింది.

25
పాక్ లో ఆన్లైన్ జిహాద్ కోర్సులు

జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇలా ధ్వంసంచేసిన 9 స్థావరాలలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం కూడా ఉంది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయారు.

అయితే ఈ జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగాన్ని కలిగివుందన్న విషయం ఈ సమయంలోనే బైటపడింది... మసూద్ అజార్ సోదరీమణులు నేతృత్వంలోనే ఈ ‘జమాత్ ఉల్ ముమినాత్’ నడుస్తోంది. ఇప్పుడు ఈ మహిళా ఉగ్రవాదుల విభాగం ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సంస్థలో చేరేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు... ఇందుకోసం మహిళలకు ఆన్‌లైన్ జిహాదీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి పాకిస్థానీ కరెన్సీలో 500 రూపాయల ఫీజు కూడా నిర్ణయించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చాలామంది మహిళలు ఈ కోర్సులో చేరినట్లు సమాచారం.

35
తుఫత్ అల్ మోమినత్ కోర్సు

మహిళా ఉగ్ర విభాగం ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ జిహాదీ కోర్సును 'తుఫత్ అల్ మోమినత్' పేరుతో నడుపుతున్నారు. 500 పాకిస్థానీ రూపాయలు చెల్లించి చాలామంది ఇందులో చేరారు. ఇప్పుడు ఈ మహిళా విభాగం ఈ కోర్సు ద్వారా డబ్బుతో పాటు తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని చూస్తోంది. ఉగ్రవాద వర్గాల్లో ఈ ఆన్‌లైన్ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోంది.

45
నవంబర్ 8 నుంచి కోర్సు ప్రారంభం

జైష్-ఎ-మొహమ్మద్ మహిళా ఉగ్ర విభాగం ప్రారంభించిన ఈ జిహాదీ ఆన్‌లైన్ కోర్సు నవంబర్ 8 నుంచి మొదలవుతుంది. ప్రతిరోజూ 40 నిమిషాల పాటు కోర్సు ఉంటుంది. మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ శిక్షణ ఇస్తారు. సాదియా అజార్ భర్త యూసుఫ్ అజార్ భారత్ జరిపిన 'ఆపరేషన్ సిందూర్' వైమానిక దాడిలో చనిపోయాడు.

55
జైష్-ఎ-మొహమ్మద్‌కు ఆర్థిక కష్టాలు

జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉగ్ర స్థావరాలపై దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనేత కుటుంబ సభ్యులు చనిపోయారు… వీరంతా ఈ సంస్థలో కీలక సభ్యులు. వీరి మరణానికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం కూడా అందలేదని సమాచారం.

అయితే తమ ఉగ్రవాద కార్యకలాపాలను ఎలాగైనా తిరిగి ప్రారంభించాలని జైష్-ఎ-మొహమ్మద్ కష్టపడుతోంది. అందుకే వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించాలని చూస్తోంది. ఇప్పుడు మహిళా విభాగం ఈ కొత్త పథకం ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories