హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ప్రమాదంలో పడనుందా.? ఇరాన్ దెబ్బ గ‌ట్టిగానే ప‌డేలా ఉందిగా.

Published : Apr 01, 2026, 10:47 AM IST

Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలు ప్రపంచ టెక్ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

PREV
15
అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ హెచ్చరిక

ఇరాన్ సైనిక విభాగమైన ఐఆర్‌జీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు ఇప్పుడు తమకు “చట్టబద్ధమైన లక్ష్యాలు” అని పేర్కొంది. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు అధునాతన సాంకేతికతతో జరిగే యుద్ధాలకు సహకరిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేథ (AI) ఆధారిత టార్గెటింగ్ సిస్టమ్‌ల ద్వారా ఇరాన్ నేతలను గుర్తించి దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.

25
18కి పైగా కంపెనీలు టార్గెట్ జాబితాలో

ఇరాన్ విడుదల చేసిన జాబితాలో 18కి పైగా అంతర్జాతీయ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో మెటా, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఎన్విడియా, ఒరాకిల్, టెస్లా, బోయింగ్ లాంటివి ఉన్నాయి. ఈ సంస్థలు యుద్ధ సాంకేతికతలో భాగమై పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ అవసరమైతే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

35
AI టెక్నాలజీపై ఇరాన్ ఆరోపణలు

ఇజ్రాయెల్, అమెరికా సహకారంతో జరిగిన దాడుల్లో ఆధునిక AI టెక్నాలజీ ఉపయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా లక్ష్యాలను కచ్చితంగా గుర్తించి దాడులు జరిగాయని అంటోంది. ఇప్పటికే 250కి పైగా ఇరాన్ ఉన్నతాధికారులు లక్ష్యంగా దాడులు జరిగాయని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇకపై ఇలాంటి దాడులు కొనసాగితే టెక్ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

45
మధ్యప్రాచ్యంలో టెక్ మౌలిక వసతులపై ప్రభావం

ఈ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఇటీవల అమెజాన్ AWS క్లౌడ్ సేవలు కూడా ప్రభావితమైనట్లు సమాచారం. బహ్రెయిన్, యూఏఈ ప్రాంతాల్లో డ్రోన్ కార్యకలాపాల కారణంగా క్లౌడ్ సర్వర్ల పనితీరులో అంతరాయం ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఇది ప్రపంచ టెక్ సేవలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

55
హైదరాబాద్ టెక్ రంగంపై ఎలాంటి ప్ర‌భావం

హైదరాబాద్ ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఐటీ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి సంస్థలకు ఇక్కడ పెద్ద కార్యాలయాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే ప్రపంచ ఐటీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. క్లౌడ్ సేవలు, డేటా నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ టెక్ కార్యకలాపాలపై దాని ప్రభావం కనిపించవచ్చు. కంపెనీల‌కు ఎలాంటి ప్ర‌మాదం పొంచి ఉన్నా మొద‌ట ఉద్యోగుల‌నే టార్గెట్ చేస్తాయ‌ని తెలిసిందే. అయితే భారతదేశంలో భద్రతా వ్యవస్థలు బలంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలకు ప్రత్యక్ష ప్రమాదం తక్కువేనని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచ రాజకీయ పరిస్థితులు టెక్ రంగంపై ఎలా ప్రభావం చూపుతాయో అన్న అంశంపై సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read more Photos on
click me!

Recommended Stories