Iran israel war: అమెరికా ముందు ఇరాన్ నిల‌బ‌డ‌గ‌ల‌దా? ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తుంది.?

Published : Mar 04, 2026, 02:30 PM IST

Iran israel war: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు కొన‌సాగుతున్నాయి. ఇరాన్ సైతం బ‌లంగానే ప్ర‌తిస్పందిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ ఇంకెన్ని రోజులు యుద్ధం చేయ‌గ‌ల‌దు.? ఎన్ని రోజులు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌దో తెలుసుకుందాం. 

PREV
15
5వ రోజు కొన‌సాగుతోన్న యుద్ధం

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సైనిక స్థావరాలపై భారీ దాడులు చేశాయి. అమెరికా తన భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నౌకలు, F-22 యుద్ధవిమానాలను వినియోగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది ముందస్తు రక్షణ చర్య అని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు క‌నిపించ‌డం లేదు. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అలీ ఖ‌మేనీ మ‌ర‌ణించిన సైన్యం ప్రతిదాడులు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి.

25
ఇరాన్ ప్రతిదాడులు ఎలా ఉన్నాయి?

ఇరాన్ ఈ యుద్ధాన్ని తన సరిహద్దుల్లోనే ఆపలేదు. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న బ‌హెరిన్‌, కువైట్‌, ఖ‌త‌ర్‌, దుబాయ్‌ల‌పై క్షిపణి దాడులు చేస్తోంది. అదే విధంగా ఇజ్రాయెల్‌పై 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గ‌చి శాంతి కోసం సిద్ధంగా ఉన్నామని, కానీ యుద్ధానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

35
ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం సాగుతుంది?

సైనిక నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు ఈ యుద్ధం 7 నుంచి 10 రోజులలో ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా సైనిక శక్తి బలంగా ఉండటంతో, ఇరాన్ ఎక్కువ రోజులు తట్టుకోలేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మరికొందరు నిపుణులు ఒక కీలక అంశాన్ని చెబుతున్నారు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ప్ర‌పంచ‌దేశాల కోరిక మేర‌కైనా యుద్ధం ఆగే అవ‌కాశం ఉన్న‌ట్లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

45
ఇరాన్ వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు ఉన్నాయి?

యుద్ధం ప్రారంభానికి ముందు ఇరాన్ వద్ద సుమారు 3,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా. ఇజ్రాయెల్ రక్షణ బలగాల సమాచారం ప్రకారం గత ఘర్షణల్లో, తాజా దాడుల్లో సగానికి పైగా క్షిపణులు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 1,000 నుంచి 1,500 మధ్య క్షిపణులు మిగిలి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సుమారు 200 లాంచర్లు కూడా నాశనం అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.

55
ఇరాన్ అసలు బలం – అండర్‌గ్రౌండ్ “మిసైల్ సిటీ”

ఇరాన్ ప్రధాన బలం భూమికి లోతులో నిర్మించిన రహస్య క్షిపణి కేంద్రాలు. వీటిని “మిసైల్ సిటీ” అని పిలుస్తారు. కొండల కింద సుమారు 500 మీటర్ల లోతులో ఇవి ఉన్నాయని సమాచారం. ఈ బంకర్లలో వేలాది డ్రోన్లు, క్షిపణులు దాచినట్లు అంచనా. ఈ ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడం అమెరికాకు కూడా పెద్ద సవాల్‌గా మారవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories