అసలు UAE అంటే ఏమిటి..? ఓ దేశమా లేక దేశాల సమూహమా..? ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలు, పశ్చిమ ఆసియా దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఇరాన్ పై యుద్దమేఘాలు కమ్ముకున్నాయి... అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని హతమార్చారు... ఇంతటితో ఆగకుండా దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగింది... కానీ దాడులుచేస్తున్న ఇజ్రాయెల్, అమెరికాలపై కాకుండా పొరుగుదేశాలపై బాంబులు కురిపిస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్, UAE, గల్ఫ్ దేశాల్లో అలజడి రేగింది.
అయితే చాలామందికి ఓ కన్ఫ్యూజన్ ఉండిఉంటుంది... అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అనేది ఓ దేశమా.. దేశాల సముదాయమా..? బాగా వినిపించే దుబాయ్, కువైట్, అబుదాబి అనేవి దేశాలా.. పట్టణాలా..? ఏమిటీ మిడిల్ ఈస్ట్..? ఏమిటీ గల్ఫ్ దేశాలు..? ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంశాల గురించి తెలుసుకుందాం.
25
ఏమిటీ UAE..?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అనేది ఓ సార్వభౌమ దేశం. కొన్ని ప్రాంతాల సమూహమే యూఏఈ... ఇది 1971లో ఏర్పడింది. ఇందులో ఏడు ఎమిరేట్స్ ఉంటాయి. ఇప్పటికీ కొన్ని ఇస్లామిక్ ప్రాంతాల్లో రాచరిక పాలన కలిగివున్నాయి... వీటినే ఎమిరేట్స్ అంటారు. ఇలా ప్రభుత్వాలు, పాలకులు ఉన్నా రాజులు సర్వాధికారాలు కలిగివుండేవే ఎమిరేట్స్.
యూఏఈలోని ఏడు ఎమిరేట్స్ ఇవే..
అబుదాబి
దుబాయ్
షార్జా
అజ్మాన్
ఉమ్ అల్ క్వైన్
రస్ అల్ ఖైమా
ఫుజైరా
అంతర్జాతీయ స్థాయిలో UAE ని ఓ దేశంగా పరిగణిప్తారు. దౌత్యపరమైన అంశాలు, వాణిజ్యం, క్రీడలతో పాటు ఐక్యరాజ్య సమితిలోనూ ఈ ఏడు ఎమిరేట్స్ ను యూఏఈ గానే గుర్తిస్తారు.
35
గల్ప్ దేశాలు అంటే..?
గల్ప్ సహకార మండలి (GCC) లోని దేశాలను సాధారణంగా గల్ఫ్ దేశాలుగా పేర్కొంటారు. ఇది కొన్ని దేశాల సమూహం... ఇందులో UAE కూడా భాగస్వామి. అరేబియా ద్వీపకల్పంలో పెర్షియన్ గల్ప్ తీరంలోని దేశాలనే గల్ఫ్ కంట్రీస్ అంటారు.
ఇరాన్ దేశం కూడా పర్షియన్ గల్ఫ్ సరిహద్దుల్లోనే ఉంది... కానీ ఇది GCC లో భాగస్వామి కాదు. అందుకే దీనిని గల్ఫ్ దేశంగా పరిగణించరు... గల్ఫ్ సరిహద్దు దేశంగా పేర్కొంటారు. ఇరాన్ అనేది సర్వస్వతంత్ర పాలన కలిగిన పశ్చిమ ఆసియా దేశం.
ఇక ఇజ్రాయెల్ ను మిడిల్ ఈస్ట్ దేశంగా పరిగణిస్తారు. ఇది గల్ఫ్ దేశం కాదు... ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ సరిహద్దును కలిగిలేదు. ఇది మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం తీరంలో ఉంటుంది.
55
మిడిల్ ఈస్ట్, గల్ఫ్, పశ్చిమ ఆసియా పదాలకు తేడా ఇదే..
మిడిల్ ఈస్ట్ :
ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు కలిగిన ప్రాంతం.
గల్ఫ్ దేశాలు :
GCC (Gulf Cooperation Council)లోని దేశాలనే గల్ఫ్ కంట్రీస్ అంటారు.
పశ్చిమ ఆసియా :
ఇది చాలా విస్తృత పదం.. ఎక్కువ దేశాల గురించి ప్రస్తావించేందుకు ఉపయోగిస్తుంటారు. మధ్యధరా, నల్ల, ఎర్ర సముద్రాలు, పెర్షియన్ గల్ప్ మధ్య విస్తరించిన సుమారు 18 దేశాలను పశ్చిమ ఆసియా దేశాలు అంటారు. ఇందులో గల్ఫ్ దేశాలు కూడా ఉంటాయి.