H1 B Visa: ల‌క్ష డాల‌ర్ల ఫీజుపై వైట్ హౌజ్ కీలక ప్రకటన.. కొందరికీ ఊరట, మరికొందరికీ భారం

Published : Sep 23, 2025, 10:43 AM IST

H1 B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసా విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంతో యావ‌త్ ప్ర‌పంచం ఉలిక్కిప‌డింది. ఇక‌పై అమెరికాలో ఉద్యోగం చేయడం క‌లేనా అన్న వాద‌న‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో వైట్ హౌజ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 

PREV
15
భారీ ఫీజుతో కొత్త నిబంధనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, కొత్తగా హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఒకసారి చెల్లించాల్సిన ఫీజు లక్ష డాలర్లు (సుమారు రూ.83–88 లక్షలు)గా నిర్ణయించారు. ఈ నిబంధన 2025 సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం 1,500 డాలర్లుగా ఉన్న వీసా ఫీజును ఇంత భారీగా పెంచడం వల్ల అమెరికా సంస్థలకు ఏటా సుమారు రూ.1.24 లక్షల కోట్ల వరకు అదనపు ఖర్చు వస్తుందని అంచనా.

25
కొన్ని విభాగాల‌కు మిన‌హాయింపు

వైట్ హౌస్ ప్రకటన ప్రకారం, కొన్ని కీలక రంగాలకు ఈ ఫీజు పెంపు వర్తించదు. వైద్యులు, ఆరోగ్య సేవల నిపుణులు, మెడికల్ రెసిడెంట్లు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, స్టెమ్ పరిశోధన, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఉన్న నిపుణులు మినహాయింపు పొందే అవకాశం ఉంది. అదనంగా, అమెరికాలో స్థిర నివాసం కలిగిన వ్యక్తులు, పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, రవాణా రంగాల్లో పనిచేసే కార్మికులకు కూడా మినహాయింపులు వర్తిస్తాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) స్పష్టం చేసింది.

35
భారత ఐటీ రంగంపై దెబ్బ

హెచ్-1బీ వీసా దారులలో 71 శాతం మంది భారతీయులే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు, అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు భారత నిపుణులపై ఆధారపడ్డాయి. లక్ష డాలర్ల ఫీజు భారం కారణంగా కంపెనీలు కొత్త వీసాల కోసం దరఖాస్తు చేయడాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీని వల్ల రిమోట్ వర్క్ పెరగడం, అమెరికాలో ప్రాజెక్టులు ఆలస్యం కావడం, కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గిపోవడం తప్పదని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

45
భార‌త్‌కు మంచిదే అంటోన్న నిపుణులు

నాస్కామ్, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ వంటి సంస్థలు ఈ ఆర్డర్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘ఇది వాస్తవానికి నిషేధం మాదిరిగానే ప్రభావం చూపుతుంది’’ అని జీటీఆర్ఐ హెడ్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు. భారత విదేశాంగ శాఖ కూడా ఈ నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ మాత్రం ఇది భారత్‌కు అవకాశాలుగా మారవచ్చని, అమెరికా ప్రతిభకు తలుపులు మూసుకుంటే ఆవిష్కరణలు హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి భారత నగరాలకు వలస వస్తాయని అన్నారు.

55
అమెరికాలోనే విమర్శలు

అమెరికా నిపుణులు కూడా ఈ ఫీజు పెంపును ఆర్థిక దృష్టిలో హానికరంగా పరిగణిస్తున్నారు. కాటో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డేవిడ్ జే. బియర్ మాట్లాడుతూ, ‘‘ఇంత అధిక ఫీజు వల్ల ప్రతిభావంతులైన విదేశీ వర్కర్లు దూరమవుతారు. ఇది అమెరికా ఉద్యోగ మార్కెట్‌ను దెబ్బతీస్తుంది’’ అన్నారు. స్థానికుల వేతనాలు పెరగడం కాకుండా ప్రాజెక్టుల ఖర్చులు అధికమై, చివరికి వినియోగదారులపైనే భారం పడుతుందని హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories