అమెరికా కలలు చెదరగొట్టే నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాపై వైట్‌హౌస్‌ క్లారిటీ..

Published : Sep 21, 2025, 12:29 PM IST

H-1B visa fees : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీ వీసా వన్‌టైమ్ ఫీజును $1,00,000కి పెంచడంతో భారతీయ ఐటీ నిపుణులు ఆందోళనలో పడారు. ఇప్పటికే వీసా కలిగినవారికి ప్రభావం లేదు, కొత్త అభ్యర్థులు సమస్యలెదుర్కొనే అవకాశముంది.

PREV
15
అమెరికా కల చెదురుతోంది

“అమెరికా కల” అనే మాట శతాబ్దకాలంగా వినిపిస్తుంది. అది ఆశలు, అవకాశాలు, కలల జీవితానికి ప్రతిబింబిస్తుంది. అయితే, ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. తాజాగా వీసాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అధికారికంగా అమెరికాకు వెళ్లినవారైనా, అనధికారికంగా వెళ్లినవారైనా ఈ కొత్త నియమావళి వారి జీవితంపై ప్రభావం చూపనుంది. అమెరికాలో శిక్షణ, ఉద్యోగం, కుటుంబం వంటి సాధారణ జీవిత కార్యకలాపాలు ఇప్పుడు మరింత క్లిష్టంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వీసాల విషయంలో గణనీయ మార్పులు తీసుకవచ్చారు. 

25
హెచ్-1బీ వీసాపై ట్రంప్ సంచలన నిర్ణయం

హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్ల ( సుమారు రూ. 83 లక్షలు ) కు పెంచారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కీలకమైన హెచ్‌-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థుల్లో ఆందోళన రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అనేక మంది ఐటీ, టెక్ ప్రొఫెషనల్స్ భవిష్యత్తుపై ప్రభావం చూపనుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో యూఎస్‌ టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు అత్యవసర ఈమెయిళ్లు పంపిస్తూ, వీలైనంత త్వరగా అమెరికా చేరుకోవాలని సూచిస్తున్నాయి.

35
భారత్ – అమెరికా సంబంధాలపై ప్రభావం

హెచ్-1బీ వీసా వార్షిక రుసుంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఫీజు పెంపు నిర్ణయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ చర్య అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల రాకపోకలు ఇరు దేశాల మధ్య సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణల్లో ఎంతో సహకారం అందించాయని భారత్ గుర్తించింది. భారత-అమెరికా బలమైన సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, ఈ విషయంలో రెండు దేశాల అధికారుల మధ్య సంప్రదింపులు జరుపుతారని ప్రభుత్వం తెలిపింది.

45
ఫీజు పెంపు వివరాలు

ఇప్పటివరకు హెచ్-1బీ వీసా ఫీజు 1,000 నుండి 5,000 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఈసారి ఒకేసారి లక్ష డాలర్లకు పెంచడం వల్ల కొత్తగా ఉద్యోగంలో చేరేవారి సగటు వార్షిక వేతనాన్ని మించిన స్థాయికి చేరింది. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వార్షిక వేతనంలో 80% పైగా ఈ రుసుము ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసా పొందిన 3 లక్షల మందిలో 71% మంది భారతీయులు ఉన్నారు. ఈ భారీ పెంపు కారణంగా కొత్తగా ఉద్యోగంలో చేరేవారి అవకాశాలు చాలా తగ్గిపోవడం, ఇప్పటికే ఉన్నవారికీ భవిష్యత్ అనిశ్చితి ఏర్పడే అవకాశముంది. ఈ ఫీజు పెంపు వల్ల హెచ్-1బీ కార్యక్రమం దాదాపు రద్దు అయినట్టే పరిస్థితి ఏర్పడిందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

55
హెచ్‌-1బీ వీసా ఫీజుపై అమెరికా క్లారిటీ

హెచ్‌-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ స్పందించారు. ఆమె ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా లక్ష డాలర్ల ఫీజు వార్షిక రుసుము కాదని, కేవలం ఒకేసారి దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతానికి హెచ్-1బీ వీసా కలిగి అమెరికా బయట ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. వారికి ఈ కొత్త రుసుము వర్తించదని, ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని చెప్పారు. అలాగే ఇప్పటికే వీసా కలిగినవారికి, రెన్యూవల్‌కు సంబంధించిన దరఖాస్తులకు ఈ నిబంధన వర్తించదని వివరించారు. అందువల్ల ఈ లక్ష డాలర్ల వన్‌టైమ్ ఫీజు ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో అమెరికా వెళ్లాలని కలలుకంటున్న కొత్త అభ్యర్థులకు ఇది పెద్ద సవాలుగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories