అసలు కథ ఏంటంటే.. చైనాలో రాను రాను జనాలు తగ్గుతున్నారట. అక్కడ జనాభా తగ్గుదల నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. బ్యాచిలర్ లైఫ్ ను గడిపే యువత తమ పార్టర్ ను వెతుక్కుని మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే.. అలా సహజీవనం చేసిన వారికి 1000 యువాన్లు అనగా మన భారత కరెన్సీలో 11,650 బహుమతిగా ఇస్తామని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.
ఈఆఫర్లను బట్టి తెలుస్తోంది చైనాలో ఎంత తీవ్రంగా జనాభా సంక్షోభం ఉందో. ఇలాంటి విపత్కర పరిస్థితిని చైనా ఈమధ్య కాలంలోనే ఎదుర్కొంటోంది. ఇక ప్రభుత్వతో పాటు.. పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఓ కంపెనీ డేటింగ్‌కి వెళ్తే నగదు బహుమతి ఇస్తామని ఆఫర్ చేసింది.
Also Read: సమంత లో ఎంత మార్పు, అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బ్యూటీ.