700 కార్లు, 58 విమాానాలు, హెలికాప్టర్లు ... ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పొలిటీషన్ ఎవరో తెలుసా?

First Published | Nov 12, 2024, 3:52 PM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అపర కుభేరుడు. ఆయన విలాసవంతమైన భవనాలు, కార్లు, విమానాలు, యాచ్ గురించి వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 

అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఎవరంటే టక్కున ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారతదేశంలో అయితే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ నాడార్ మొదటి స్థానంలో ఉన్నారు. కానీ వీరందరి కంటే అధిక సంపాదన కలిగిన పొలిటీషన్ వున్నారు.    

అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు

ఈ వరల్డ్ రిచ్చెస్ట్ పొలిటీషన్ ఇంకెవరో కాదు... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన నికర సంపద దాదాపు $200 బిలియన్లుగా అంచనా వేయబడింది. అంటే భారతీయ రూపాయల్లో ₹16,71,877 కోట్లు. ఆసక్తికరంగా పుతిన్ అధికారిక ఆదాయం కేవలం $140,000 (సుమారు ₹1 కోటి) అని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆయన విలాసవంతమైన జీవనశైలి చాలా ఎక్కువ సంపదను సూచిస్తుంది.

Latest Videos


ధనవంతుడైన రాజకీయ నాయకుడు

పుతిన్ 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, మూడు కార్లు వున్నాయని బహిరంగంగా ప్రకటించాడు. కానీ నివేదికలు ఆయన వాస్తవ ఆస్తులు చాలా  ఎక్కువని సూచిస్తున్నాయి. వీటిలో బ్లాక్ సీ ప్యాలెస్, ఒక విశాలమైన భవనం ఉన్నాయి. ఆయనకు 19 ఇతర ఆస్తులు, 700 కార్లు, 58 విమానాలు, హెలికాప్టర్లు, "ది ఫ్లయింగ్ క్రెమ్లిన్" అనే $716 మిలియన్ల ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయని చెబుతారు. పుతిన్ షెహెరాజాడే అనే $700 మిలియన్ల సూపర్‌యాచ్‌ను కూడా కలిగి ఉన్నారని అంటారు.

ధనవంతుడైన రాజకీయ నాయకుడు

విలాసవంతమైన గడియారాలంటే పుతిన్ కు చాలా ఇష్టం. ఇలా ఆయన వాచ్ ల సేకరణలో $60,000 విలువైన పాటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్,  $500,000 విలువైన ఎ. లాంగే & సోహ్నే టూర్బోగ్రాఫ్ వంటి హై-ఎండ్ వాచ్ లు ఉన్నాయి.

వ్లాదిమిర్ పుతిన్ 1999 నుండి రష్యాలో నాయకత్వ పాత్రలు పోషించారు...  అధ్యక్షుడిగాకొనసాగుతున్నారు. ఆయన తన  దేశం కోసం 16 సంవత్సరాలు విదేశీ నిఘా అధికారిగా గడిపారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడు పుతిన్.

click me!