హిందువుల అణచివేత.. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి షాక్.. అంతర్జాతీయ కోర్టులో కేసు నమోదు

First Published | Nov 10, 2024, 11:59 AM IST

Bangladesh - International Criminal Court : బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్‌పై అంతర్జాతీయ కోర్టులో అవామీ లీగ్ నేత,  సిల్హెట్ మాజీ మేయర్ అన్వరుజ్జమాన్ చౌదరి ఫిర్యాదు చేశారు.
 

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ప్రస్తుతం ప్రభుత్వ అధినేత) ముహమ్మద్ యూనస్ స‌హా మరో 61 మందిపై రోమ్ శాసనంలోని ఆర్టికల్ 15 కింద నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)లో ఫిర్యాదు నమోదైంది. అవామీ లీగ్ నాయకుడు, సిల్హెట్ మాజీ మేయర్ అన్వరుజ్జమాన్ చౌదరి ఈ ఫిర్యాదు చేశారు.

బంగ్లాదేశ్‌లో విద్యార్ధి ఉద్యమం పేరుతో ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్‌తో పాటు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, బంగ్లాదేశ్ పోలీసు బలగాలు క్రూరమైన మారణహోమానికి గురయ్యారు. తీవ్ర అణిచివేత‌ను చూశారు. మానవత్వానికి వ్యతిరేకంగా జ‌రిగిన‌ నేరాలుగా పేర్కొంటూ' అన్వరుజ్జమాన్ చౌదరి ఫిర్యాదు చేశారు. 


Sheikh Hasina Muhammad Yunus

అవామీ లీగ్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన‌ వీడియో సందేశంలో ఆయన పై విషయాలను పేర్కొన్నారు. అలాగే, "ఈ విష‌యానికి సంబంధించిన మేము ICCకి వాస్తవాలు, సాక్ష్యాలతో కూడా అన్నింటిని అందించాము" అని తెలిపారు. యూనస్‌తో పాటు 62 మంది నిందితులలో యూనస్ క్యాబినెట్‌లోని సభ్యులందరూ, వివక్ష వ్యతిరేక కూటమికి చెందిన విద్యార్థి నాయకులు ఉన్నారు. ఫిర్యాదుకు  ఏకంగా 800 పేజీల పత్రాలు జ‌త‌చేసిన‌ట్టు తెలిపారు. త్వరలో ఐసీసీలో మరో 15,000 ఫిర్యాదులను దాఖలు చేసేందుకు విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయ‌నీ, బాధిత వ్యక్తులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తారని కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని ఓడరేవు నగరమైన చిట్టగాంగ్‌లో ఇస్కాన్‌ను విమర్శిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఉద్రిక్త పరిస్థితులలో హిందూ సమాజం, చట్టాన్ని అమలు చేసే దళాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కారణంగా నవంబర్ 5 రాత్రి పోలీసులు, సైన్యం సంయుక్తంగా అక్కడ ఆపరేషన్ నిర్వహించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ సమాజంపై జరిగిన దాడులను భారతదేశం ఖండించింది. ఇటువంటి చర్యలు సమాజంలో మరింత ఉద్రిక్తతలను సృష్టిస్తాయని పేర్కొంది.

ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను బహిష్కరించింది. కొన్ని వారాల నిరసనలు, ఘర్షణల తర్వాత 600 మందికి పైగా మరణించారు. హసీనా దేశం విడిచి పారిపోయారు. దీంతో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.

Latest Videos

click me!