Alcohol Rule: ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ ప్రియులు ఉన్నారనే విషయం తెలిసిందే. ఆల్కహాల్ విక్రయాలకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కోలా నియమాలు ఉంటాయి. అయితే థాయ్‌లాండ్‌లో ఆల్కహాల్ అమ్మకాల్లో ఒక వింత నిబంధన ఉంది. అదేంటంటే..
థాయ్‌లాండ్‌లో కొన్నేళ్ల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆల్కహాల్ విక్రయంపై నిషేధం అమలులో ఉంది. ఐదు దశాబ్దాలుగా కొనసాగిన ఈ రూల్‌ను నవంబర్ 2025లో కొంతవరకు సడలించారు. 1972లో థాయ్‌లాండ్‌ను సైనిక ప్రభుత్వం పాలిస్తున్న సమయంలో ఈ ఆంక్ష మొదలైంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం మధ్యాహ్న సమయంలో ఆల్కహాల్ అందుబాటులో ఉంటే ఉద్యోగులు పని మీద దృష్టి పెట్టడం తగ్గిపోతుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్పాదకత పడిపోతుందని భావించి మధ్యాహ్నం మూడు గంటలు ఆల్కహాల్ అమ్మకాన్ని నిలిపివేశారు.
25
సామాజిక శాంతిని కాపాడాలనే ఆలోచన
పని సంబంధిత కారణాలతో పాటు, మధ్యాహ్నం ఆల్కహాల్ తాగడం వల్ల చిన్న చిన్న గొడవలు, ప్రజా అశాంతి, నేరాలు పెరుగుతున్నాయి అని అధికారులు గమనించారు. అందుకే కొన్ని గంటలపాటు ఆల్కహాల్ దొరకకుండా చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయని భావించారు. అలా “సామాజిక క్రమాన్ని కాపాడడం” అనే భావనతో కూడా ఈ రూల్ కొనసాగింది.
35
పర్యాటక రంగం ఒత్తిడి
కాలానుగుణంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో ఒకటిగా మారింది. టూరిస్ట్ ప్రదేశాలు, హోటళ్లు, బార్లు ఈ నియమంతో ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. విదేశీ పర్యాటకులు కూడా మధ్యాహ్నం ఆల్కహాల్ దొరకకపోవడం ఆశ్చర్యంగా భావించేవారు. అలా పర్యాటక రంగం నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ రూల్‌ను తిరిగి పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. పాత నిషేధం దేశ ఆర్థిక ప్రయోజనాలకు సరిపడడం లేదని ప్రభుత్వం గ్రహించింది.
సుదీర్ఘ సమీక్ష తర్వాత థాయ్ ప్రభుత్వం నవంబర్ 2025లో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య లైసెన్స్ ఉన్న హోటళ్లు, రిసార్ట్‌లు, ఎంటర్టైన్‌మెంట్ సెంటర్‌లు ఆల్కహాల్ విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. ఇది పర్యాటక రంగానికి భారీ రిలీఫ్‌గా మారింది. ఈ నిర్ణయం వల్ల వ్యాపారాలు తిరిగి చురుకుగా మారే అవకాశం ఉంది.
55
సడలింపు ఇచ్చినా కఠిన నిబంధనలు
నిర్ణీత సమయంలో ఆల్కహాల్ తాగుతూ కనిపిస్తే ఫైన్ పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్కహాల్ ముందే కొనుకున్నా కూడా. ఈ నియమాలు ఎలా అమలవుతాయన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బార్, రెస్టారెంట్ యజమానులు ఈ అపోహల వల్ల మళ్లీ కస్టమర్లు ఇబ్బంది పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. దీని అర్థం పాలసీ సడలించినా, అమలులో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.