Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే

Published : Dec 05, 2025, 05:53 PM IST

Safe Countries for Women: మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో ఇప్ప‌టికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతుంటారు. కానీ ప్ర‌పంచంలో మ‌హిళ‌లు అత్యంత సుర‌క్షిత‌మైన కొన్ని దేశాలు ఉన్నాయ‌ని తెలుసా? 

PREV
15
మహిళలకు భద్రత అంటే ఏంటి?

మహిళ బయటికి వెళ్లేటప్పుడు భయం లేకుండా నడవగలగటం, రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించగలగటం, గుంపులో ఉన్నా సురక్షితంగా అనిపించడం. ఇవన్నీ నిజమైన భద్రతకు సూచికలు. ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ ప్రమాణాలకు అచ్చం సరిపోతాయి. అక్కడ చట్టాలు కేవలం పుస్తకాలలో ఉండవు, నిజంగా అమలులో ఉంటాయి. Women Peace and Security (WPS) Index 2025 ఈ విషయాన్ని బలంగా చూపించింది.

25
మొద‌టి స్థానంలో డెన్మార్క్

డెన్మార్క్ ఎందుకు మొదటి స్థానంలో నిలిచిందంటే, అక్కడ మహిళల భద్రత కేవలం పోలీసింగ్‌తో కాదు, ప్రభుత్వ విధానాల ప్రతి దశలో కనిపిస్తుంది. మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేధింపులపై కఠిన చర్యలు ఉంటాయి. లింగ వివక్షకు తావు లేకుండా ఉన్న సమాజం. అక్కడ మహిళలు విద్య, రాజకీయాలు, కంపెనీల నిర్ణయాల్లో సహజంగానే నాయకత్వం వహిస్తారు. లింగ ఆధారిత నేరాలు చాలా తక్కువగా నమోదు అవుతాయి.

35
రెండో స్థానంలో ఐస్‌లాండ్

రెండో స్థానంలో ఉన్న ఐస్లాండ్, మహిళలకు అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటి. ఆర్థికంగా మహిళలు బలపడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఉంటుంది. గృహ హింస, వివక్షపై కఠిన చట్టాలు అమ‌ల్లో ఉంటాయి. ఈ చర్యల వల్ల ఐస్‌లాండ్ మహిళలకు రక్షణతో పాటు గౌరవం కలిగించే ‘సేఫ్ జోన్’ లాగా మారింది.

45
నార్వే, స్వీడ‌న్ దేశాలు

మూడో స్థానంలో నార్వే, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ఇవి లింగ సమానత్వాన్ని ఆచరణలో చూపే దేశాలు. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, పరిపాలనలో మహిళల కీలక పాత్ర పోషిస్తారు. వేగవంతమైన, నిష్పక్షపాత న్యాయ ప్రక్రియ ఉంటుంది. నేరాలకు తక్షణ శిక్షలు ఉంటాయి. అక్కడ మహిళల భద్రత రాజకీయ వివాదం కాదు, సమాజంలో సహజంగా ఉన్న విలువ.

55
ఫిన్లాండ్

ఐదవ స్థానంలో ఉన్న ఫిన్లాండ్, భద్రతతో పాటు మహిళల ప్రగతికి ప్రసిద్ధి చెందిన దేశం. పార్లమెంట్, మంత్రివర్గంలో మహిళల మంచి ప్రాతినిధ్యం ఉంటుంది. ఉన్నత స్థాయి విద్య, ఆరోగ్య సదుపాయాలు ఉంటాయి. రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించినా భయం లేకుండా ఉండే వాతావరణం ఉంటుంది. మహిళలకు ఇక్కడ స్వాతంత్రం, గౌరవం రెండూ ప్రాధాన్యంగా లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories