Putin walking style: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరు. ప్రస్తుతం పుతిన్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నడిచే తీరు చాలా మందికి తెలియదు. ఆయన కుడి చేయి కాస్త కఠినంగా ఉంచుతారు. ఎడమ చేయి మాత్రం సాధారణంగా ఊగుతుంది. ఇదేమైనా ఆరోగ్య సమస్య సంకేతమా అన్న అనుమానం నిపుణులకు వచ్చింది.
25
ఇది స్ట్రోక్ కాదు, పార్కిన్‌సన్స్ సమస్య కూడా కాదు
నెదర్లాండ్స్‌లోని రాడ్బౌడ్ యూనివర్సిటీలో న్యూరాలజీ ప్రొఫెసర్ బస్టియన్ బ్లోయమ్ దీనిపై పరిశీలన చేశారు. ఆయన చెప్పినట్టు, ఈ నడకలో కనిపించే కఠినత పార్కిన్‌సన్స్‌లో కూడా కనిపిస్తుంది. అయితే పుతిన్‌కు అలాంటి లక్షణాలు కనిపించలేదు. పరిశోధకులు పుతిన్ వీడియోలను పరిశీలించాక ఇది వైద్య సమస్య కాదని స్పష్టమైంది.
35
అసలు కారణం ఏంటంటే.?
పరిశోధకులు పాత KGB ట్రైనింగ్ మాన్యువల్స్ పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. KGB ఏజెంట్లు ఒకప్పుడు పిస్టల్‌ను కుడి చేతిలో ఛాతికి దగ్గరగా పట్టుకుని నడవాలి అని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇలా నడిస్తే శత్రువు ఎదురైతే ఆయుధాన్ని సెకన్లలో తీసి సంరక్షించుకోవచ్చు. కుడి చేయి కఠినంగా ఉంచడానికే ఈ శిక్షణ.
వీడియోలు పరిశీలించగా పుతిన్ మాత్రమే కాదు, దిమిత్రి మెద్వెదేవ్, ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు, జనరల్ అనటోలీ సిద్ధారోవ్‌లో కూడా ఇదే తరహా నడక కనిపించింది. దీంతో ఇది వ్యక్తిగత శైలి కాకుండా, ఆయుధాల శిక్షణ ప్రభావం అని నిపుణులు నిర్ధారించారు.
55
“గన్స్‌లింగర్ గైట్” – పరిశోధకులు పెట్టిన పేరు
ఈ ప్రత్యేక నడకకు పరిశోధకులు “గన్స్‌లింగర్ గైట్” అనే పేరు పెట్టారు. దీని అర్థం గన్‌దారుడు నడక. కుడి చేయి ఛాతికి దగ్గరగా ఉంచి, అవసరమైతే వెంటనే గన్ తీసేలా శరీరం సిద్ధంగా ఉంచే నడక. పుతిన్ పాత KGB ఏజెంట్ కావడం వల్ల ఈ శిక్షణ ఇప్పటికీ ఆయన నడకలో స్పష్టంగా కనిపిస్తుందని వారు భావిస్తున్నారు.