Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే

Published : Dec 20, 2025, 01:56 PM IST

Alcohol: ఆల్క‌హాల్ వినియోగం లేని దేశం లేద‌ని చెప్పాలి. ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలిసినా చాలా దేశాల్లో ఆల్క‌హాల్ ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో ఒక భాగంగా మారింది. మ‌రి ప్ర‌పంచంలో అత్యధికంగా ఆల్క‌హాల్ సేవించే దేశాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
15
ఆల్క‌హాల్ వినియోగంలో తేడాలు

ప్రపంచ దేశాల్లో మందు వినియోగంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఇది అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాల్లో ఆల్క‌హాల్‌ సామాజిక జీవితంలో భాగంగా మారింది. 2025 గ్లోబల్ డేటా ప్రకారం యూర‌ప్ ఖండంలో అత్యధికంగా ఆల్క‌హాల్ సేవించే వారు ఉన్నారు.

25
ఎక్కువగా తాగే దేశం ఇదే

2025 వరల్డ్ పాప్యులేషన్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం రొమేనియా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అక్కడి ఒక్కో వ్యక్తి సగటున సంవత్సరానికి సుమారు 17 లీటర్ల ఆల్కహాల్ సేవిస్తున్నాడు. ఈ సంఖ్య ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

35
రొమేనియాలోనే ఎందుకు ఎక్కువ

రొమేనియాలో ఆల్క‌హాల్‌ అతిథి సత్కారానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ కార్యక్రమాలు, అంత్యక్రియల్లో కూడా ఆల్కహాల్ వడ్డించడం సాధారణం. దీంతో ఆల్క‌హాల్‌ సేవించడం సామాజికంగా ఆమోదం పొందిన అలవాటుగా మారింది. ఇక్కడ ఇంట్లో తయారయ్యే సంప్రదాయ ఆల్క‌హాల్‌ కూడా ఎక్కువగా వాడుతుంటారు. ప్లమ్, ద్రాక్షతో తయారయ్యే ‘తుయికా’ గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా తాగుతుంటారు.

45
వేల సంవత్సరాల చరిత్ర

రొమేనియాలో ఆల్క‌హాల్‌ తయారీకి 2000 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. అక్కడ ఆల్క‌హాల్‌ ధరలు తక్కువగా ఉండటం కూడా వినియోగం పెరగడానికి కారణం. కొన్ని ప్రాంతాల్లో పన్ను లేకుండా లభించే లేదా అక్రమంగా అమ్మే ఆల్క‌హాల్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కలసి ఆల్క‌హాల్‌ వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి.

55
భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది

భారత్‌లో ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సగటున 3 నుంచి 5 లీటర్ల మధ్య ఆల్కహాల్ సేవిస్తున్నట్లు అంచనా. ఇది రొమేనియా వంటి యూరోప్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో భారత్‌లో ఆల్కహాల్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories